శ్రీ విష్ణు కొత్త చిత్రం.. హిట్ కొట్టేందుకు రెడీ
అప్పట్లో ఒకడుండేవాడు, మెంటల్ మదిలో, నీదీ నాదీ ఒకే కథ లాంటి భిన్న కథా చిత్రాలను ఎంచుకుంటోన్న యంగ్ హీరో శ్రీ విష్ణు. ఈ ఏడాది బ్రోచేవారెవరురా అంటూ పలకరించి హిట్ కొట్టగా.. రీసెంట్‌గా తిప్పరా మీసంతో నిరాశ పరిచాడు. నటనకు ప్రాధాన్యమున్న చిత్రాల్లో నటిస్తూ వస్తోన్న ఈ హీరో తాజాగా తన కొత్త చిత్రాన్ని ప్రారంభించేశాడు.
ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థలు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ ఎల్.ఎల్.పి. నిర్మిస్తున్న ఈ మూవీ పూజా కార్యక్రమాలు నేడు జరిగాయి. శ్రీవిష్ణు హీరోగా ఇటీవల వచ్చిన 'మెంటల్ మదిలో', 'బ్రోచేవారెవరురా' చిత్రాల దర్శకుడు వివేక్ ఆత్రేయ రచన దర్శకత్వ టీమ్‌లో ప్రతిభ కనబరచిన 'హాసిత్ గోలి' ఈ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయం అవుతున్నారు. ఈ మూవీని టి.జి.విశ్వప్రసాద్,అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

వినోదంతో కూడిన డ్రామాతో వైవిధ్యంగా సాగుతుందని చిత్ర దర్శకుడు హాసిత్ గోలి తెలిపారు. శ్రీవిష్ణు,హాసిత్ గోలి వంటి ప్రతిభ కలిగినవారితో ఈ చిత్రాన్ని నిర్మించటం ఎంతో ఆనందంగా ఉందని నిర్మాతలు పేర్కొన్నారు. ఒక వినూత్నమైన కథతో రూపొందనున్న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ జనవరి నెలలో ప్రారంభమవుతుందని ప్రకటించారు. ఈ చిత్రానికి వివేక్ సాగర్ సంగీతం అందిస్తుండగా.. సినిమాటోగ్రఫర్‌గా వేదరామన్ పని చేస్తున్నారు. ఇక చిత్రంలోని ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు కొద్ది రోజులలోనే ప్రకటిస్తామని ఈ చిత్ర నిర్మాతలు తెలిపారు.


Click it and Unblock the Notifications











