మీసం తిప్పేందుకు సమయం వచ్చింది.. మరో హిట్ గ్యారంటీ..
కథలకు తగ్గట్టు మారడం, పాత్రకు అతికినట్టు నటించడం శ్రీవిష్ణుకు ఉన్న ప్రత్యేకత. ప్రతీ సినిమాలోనూ కొత్త దనం చూపించేందుకు ప్రయత్నించే ఈ హీరో.. వరుస విజయాలను అందుకుంటున్నాడు. తాజాగా బ్రోచేవారెవరురా అంటూ పలకరించాడు. ఈ చిత్రం మంచి సందేశంతో పాటు ఎంటర్‌టైన్ మెంట్ కూడా తోడవ్వడంతో ఈ సినిమాను అందరూ ఆదరించారు.
కొత్త దనానికి పెద్ద పీఠ వేస్తూ.. హీరోయిజం ప్రదర్శించే పాత్రలకంటే కథను నడిపించే క్యారెక్టర్‌లను పోషిస్తూ.. సక్సెస్ సాధిస్తున్నాడు. మెంటల్ మదిలో, నీదీనాదీ ఒకే కథ, బ్రోచేవారెవరురా అంటూ వరుస విజయాలను అందుకుంటున్నాడు. మరోసారి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచేందుకు సిద్దమయ్యాడు ఈ హీరో.

తిప్పరా మీసం అంటూ టైటిల్‌తోనే పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేసిన చిత్రబృందం.. టీజర్‌తో అంచనాలను పెంచేసింది. ఈ మూవీ కోసం శ్రీవిష్ణు కొత్త లుక్‌ను ట్రై చేశాడు. ఈ చిత్రాన్ని రిజ్వాన్ నిర్మిస్తుండగా.. కృష్ణ విజయ్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో నిక్కి తంబోలి హీరోయిన్‌గా నటిస్తోంది. సురేష్ బొబ్బిలి ఈ చిత్రానికి సంగీతం అందించాడు. ఈ మూవీ నవంబర్ 8న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది.


Click it and Unblock the Notifications











