Om Bheem Bush: "ఓం భీమ్ బుష్"పై సెన్సార్ రియాక్షన్.. రన్ టైమ్ ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే!

సినీ ప్రియులు అందరినీ కడుపుబ్బా నవ్వించాలనే ఉద్దేశంతో తెరకెక్కించిన సినిమానే ఓం భీమ్ బుష్. ఈ సినిమాలో శ్రీవిష్ణు, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శిలు ప్రధాన పాత్రల్లో కనిపించబోతుండగా.. శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వం వహించారు. మార్చి 22వ తేదీన థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కాబోతున్న ఈ సినిమా ఈరోజు సెన్సార్ పూర్తి చేసుకుంది. ముఖ్యంగా ఈ సినిమా చాలా క్రిస్పీగా ఉండబోతున్నట్లు రన్ టైమ్ చూస్తుంటే అర్థం అవుతుంది. ముఖ్యంగా ఈ చిత్రానికి ఏ సర్టిఫికేట్ వచ్చింది, రన్ టైమ్ ఎంత ఫిక్స్ చేశారో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

పూర్తి కామెడీ జోనర్ లో రాబోతున్న ఈ సినిమాను యువీ క్రియేషన్స్, వి సెల్యూలాయిడ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ముఖ్యంగా ఈ సినిమాలో శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణలతో పాటు ప్రీతి ముకుందన్, ఆయేషా ఖాన్, శ్రీకాంత్ అయ్యంగార్, రచ్చ రవి, ఆదిత్య మీనన్ కీలక పాత్రల్లో నటించబోతున్నారు. అలాగే సన్నీ ఎం ఆర్ సంగీతం అందించగా.. రాజ్ తోట సినిమాటోగ్రాఫర్ గా పనిచేశారు. విజయ్ వర్ధన్ ఎడిటింగ్ బాధ్యతలు చూసుకున్నారు.

Sree Vishnu om Bheem Bush Movie Completed Censor Check Details

అయితే ఇప్పటికే విడుదల అయిన ఈ సినిమా ట్రైలర్, పోస్టర్, టీజర్ లు సినిమాపై విపరీతంగా అంచనాలు పెంచేశాయి. ముఖ్యంగా శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణల మధ్య వచ్చే కామెడీ అయితే నెక్స్ట్ లెవెల్ అనే చెప్పొచ్చు. అదిరిపోయే కాన్సెప్ట్ తో రాబోతున్న ఈ సినిమాను మార్చి 22వ తేదీన గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారు. అయితే తాజాగా ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది.

క్రేజీ కాన్సెప్ట్ తో రాబోతున్న ఈ సినిమాకు సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికేట్ ఇచ్చింది. ఓ భీమ్ బుష్ రన్ టైమ్ ను చాలా తక్కువ టైమ్ కు లాక్ చేశారు. ముఖ్యంగా కేవలం 2.15 నిమిషాలకే సినిమా రన్ టైమ్ ను ఫిక్స్ చేశారు. అంటే కేవలం ఈ సినిమా 135 నిమిషాలు మాత్రమే ఉండబోతుంది. ఇంత తక్కవ సమయం ఉండడంతో అంతా షాక్ అవుతున్నారు. అయితే క్రిస్పీ రన్ టైమ్ సినిమాకు ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా అనేది చూడాలి.

Sree Vishnu om Bheem Bush Movie Completed Censor Check Details

గతంలో శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణల ప్రధాన పాత్రల్లో వచ్చిన బ్రోచేవారెవరురా సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కాగా.. మరోసారి వీరి కాంబోలో రాబోతున్న ఓం భీమ్ బుష్ కూడా కచ్చితంగా హిట్ అవుతుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. చూడాలి మరి ఏం జరగనుంది అనేది. అంతా అనుకున్నట్లుగా ఈ సినిమా హిట్ గా నిలుస్తుందా లేదా అనేది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X