ఇంట్రెస్టింగ్‌గా ఫస్ట్ లుక్.. ‘రాజ రాజ చోర’ అంటూ పరుగులు
చేసే ప్రతీ సినిమాలో ఏదో ఒక కొత్తదనం ఉండాలని చూసే హీరో శ్రీ విష్ణు. కెరీర్ ఫ్రారంభం నుంచీ అదే పంథాలో పయణిస్తూ తనకంటూ ఓ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడు. అయితే మధ్యలో ప్రయోగాలు చేస్తే బెడిసికొట్టాయి. అయినా సరే కొత్త కథలకు తన ఓటు అంటున్నాడు. చివరగా వచ్చిన బ్రోచేవారెవరురాతో మరో హిట్ కొట్టేశాడు.
తాజాగా మరో చిత్రానికి సంబంధించిన అప్‌డేట్‌ను ఇచ్చాడు. నేడు (ఫిబ్రవరి 28) శ్రీ విష్ణు పుట్టిన రోజు సందర్భంగా తదుపరి మూవీ అప్‌డేట్‌ను ప్రకటించారు. ప్రీ లుక్ రిలీజ్ చేసిన పోస్టర్ అందరిలోనూ ఆసక్తిని రేకెత్తించగా నేడు రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ ఆకట్టుకునేలా ఉంది.

రాజ రాజ చోర అంటూ టైటిల్‌తోనే ఆసక్తిని పెంచేశారు. ఇందులోనే ఓ వైవిధ్యం కనిపిస్తోంది. శ్రీ విష్ణు ఇందులో దొంగా? అనే అనుమానం వచ్చేలా ఉంది. ఫస్ట్ లుక్‌ను చూస్తే.. అతను పరిగెత్తుతున్నట్లు కనిపిస్తోంది. మొత్తానికి ఫస్ట్ లుక్‌తోనే అందరిలో ఇంట్రెస్ట్ కలిగేలా చేశారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించే ఈ సినిమాకు హసిత్ గోలి దర్శకత్వం వహిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











