Arjuna Phalguna OTT: విడుదలై నెల కాకముందే ఓటీటీలోకి.. శ్రీవిష్ణు మూవీ ఎందులో వస్తుందంటే!

స్వయంకృషితో తెలుగు చిత్రసీమలోకి ఎంట్రీ ఇచ్చి.. ఆరంభంలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా అలరించిం.. ఇప్పుడు హీరోగా సత్తా చాటుతున్నాడు టాలెంటెడ్ గాయ్ శ్రీవిష్ణు. విలక్షణ నటనతో, వైవిధ్యమైన సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు. తన సహజ సిద్ధమైన నటనతో ఎన్నో సినిమాలను వన్ మ్యాన్ షోగా మార్చేశాడతను. ఈ క్రమంలోనే హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తున్నాడు. గత ఏడాది ఆరంభంలో 'గాలి సంపత్' అనే మూవీ చేసిన అతడు.. ఆ తర్వాత 'రాజ రాజ చోర'తో భారీ హిట్‌ను ఖాతాలో వేసుకున్నాడు. ఈ ఉత్సాహంతోనే మరిన్ని చిత్రాలు లైన్‌లో పెట్టుకున్నాడు.

శ్రీవిష్ణు గత ఏడాది చివరి రోజు అంటే డిసెంబర్ 31న 'అర్జున ఫల్గుణ' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అతడి సినిమాలకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తుంటుంది. అలాగే, అందరు హీరోల అభిమానులు కూడా ఆదరిస్తుంటారు. పైగా ఈ ఏడాది విడుదల అవుతోన్న చివరి సినిమా కావడంతో 'అర్జున ఫల్గుణ' సినిమాను ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేశారు. అయితే, ఈ సినిమాకు మాత్రం అనుకున్న రీతిలో స్పందన మాత్రం దక్కలేదు. దీంతోపాటు ఆరంభంలోనే నెగెటివ్ టాక్ వచ్చింది. దీంతో ఈ సినిమాకు కలెక్షన్లు కూడా పెద్దగా రాలేదు. ఫలితంగా శ్రీవిష్ణుకు నిరాశనే మిగిల్చింది.

 Sree Vishnus Arjuna Phalguna Movie Streaming From January 21st

విలక్షణ హీరో శ్రీవిష్ణు నటించిన 'అర్జున ఫల్గుణ' మూవీ థియేటర్లలో అంతగా సందడి చేయలేదు. అంతేకాదు, చాలా తక్కువ సమయంలోనే దాదాపుగా అన్ని ప్రాంతాల్లోనూ రన్ ఆగిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ గురించి చాలా రకాల చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా దీని గురించి ఓ న్యూస్ బయటకు వచ్చింది. తాజా సమాచారం ప్రకారం.. 'అర్జున ఫల్గుణ' మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో జనవరి 21 నుంచి ప్రారంభం కాబోతుందట. ఈ మూవీ డిజిటల్ రైట్స్‌ను సదరు సంస్థ మంచి ధరకు కొనుగోలు చేసిందని అంటున్నారు.

శ్రీవిష్ణు నటించిన 'అర్జున ఫల్గుణ' మూవీ జనవరి 21న స్ట్రీమింగ్ అయ్యే విషయాన్ని చిత్ర యూనిట్ రెండు రోజుల్లోనే అధికారికంగా వెల్లడించబోతుందని తెలుస్తోంది. ఇక, అదే రోజు నందమూరి బాలకృష్ణ - బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కిన 'అఖండ' మూవీ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కాబోతుందని ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో రాహుల్ దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని నటించిన 'శ్యామ్ సింగ రాయ్' మూవీ కూడా అదే రోజు స్ట్రీమింగ్ కాబోతుందట. దీన్ని నెట్‌ఫ్లిక్స్ సంస్థ డిజిటల్ స్ట్రీమింగ్ చేయబోతుందని అంటున్నారు. అంటే ఒకేరోజు మూడు సినిమాలు స్ట్రీమింగ్ కాబోతున్నాయన్న మాట.

శ్రీవిష్ణు కెరీర్‌లోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా వచ్చిన 'అర్జున ఫల్గుణ' మూవీలో అమృత అయ్యర్ హీరోయిన్‌గా నటించింది. ఒక పల్లెటూరిలో ఉండే ఐదుగురు స్నేహితులు గంజాయి కేసులో చిక్కుకున్న నేపథ్యంలో ఈ మూవీ రూపొందింది. దీన్ని మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై అన్వేష్ రెడ్డి, నిరంజన్ రెడ్డి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. ప్రియదర్శన్ బాలసుబ్రమణియన్ దీనికి సంగీతం అందించాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X