తిప్పరా మీసం ఫస్ట్ టాక్.. శ్రీ విష్ణు సినిమా ఎలా ఉందంటే..
కృష్ణా విజయ్ దర్శకత్వంలో శ్రీ విష్ణు హీరోగా తెరకెక్కిన కొత్త సినిమా 'తిప్పరా మీసం'. శ్రీ ఓం బ్యానర్, రిజ్వాన్ ఎంటర్టైన్‌మెంట్స్ సంయుక్త సమర్పణలో రూపొందిన ఈ సినిమాలో నిక్కీ తంబోలీ, రోహిణి హీరోయిన్లుగా నటించారు. ఈ రోజే (నవంబర్ 8న) ఈ సినిమా విడుదలైంది. ఇప్పటికే ప్రీమియర్ షోస్, స్పెషల్ షో చూసిన కొందరు 'తిప్పరా మీసం' ఎలా ఉందని అంటున్నారో చూస్తే..

గుబురు గడ్డం, రఫ్ హెయిర్ స్టైల్‌తో శ్రీవిష్ణు
గుబురు గడ్డం, రఫ్ హెయిర్ స్టైల్‌తో శ్రీ విష్ణు నటన 'తిప్పరా మీసం' సినిమాలో హైలైట్‌గా నిలిచిందనే టాక్ బయటకు వచ్చింది. గతంలో ఆయన చేసిన సినిమాల లాగే ఇది కూడా ఓ డిఫెరెంట్ మూవీ అంటున్నారు. ఇందులో శ్రీవిష్ణు ఓ డిఫరెంట్ క్యారెక్టర్ చేశాడనేది ఫస్ట్ టాక్.

దాదాపు 3 గంటలు.. బెట్టింగ్ సీన్స్
158 నిమిషాల నిడివితో రూపొందిన ఈ సినిమాలో శ్రీవిష్ణు బెట్టింగ్ సీన్స్, హీరోయిన్స్ రోల్ కాస్త డిఫెరెంట్ గానే ఉందని, మ్యూజిక్ కూడా బాగుందని అంటున్నారు.

ఫస్టాఫ్ పరంగా హీరో క్యారెక్టర్
'తిప్పరా మీసం' ఫస్టాఫ్‌లో హీరో క్యారెక్టర్ మాత్రమే ఎక్కువగా చూపించారని తెలుస్తోంది. జూదానికి బానిస అయిన శ్రీ విష్ణుపై వచ్చే సీన్స్ ఆకట్టుకున్నాయని టాక్. అలాగే కెమెరా పనితనం, సంగీతం ఫస్టాఫ్‌కి మంచి ఎస్సెట్‌గా నిలిచాయనే టాక్ వినిపిస్తోంది.

సెకండాఫ్‌లో శ్రీ విష్ణు లవ్ ట్రాక్
ఇక 'తిప్పరా మీసం' సెకండాఫ్‌లో శ్రీ విష్ణు లవ్ ట్రాక్ చూపించారని అంటున్నారు. నిక్కీ తంబోలీ ప్రేమ పొందేందుకు శ్రీ విష్ణు పడే పాట్లు, కోర్టు కేసు సీన్లు కాస్త ఆసక్తికరంగానే ఉన్నాయని అంటున్నారు.

హీరోకి చుక్కలు చూపించిన పోలీసులు
హీరో శ్రీ విష్ణుకి పోలీసులు చుక్కలు చూపించే హింసాత్మక సంఘటనలోనే త్వేఇస్ట్ ఉందని అంటున్నారు. పోలీసుల టార్చర్, శ్రీ విష్ణు తన మీసాన్ని క్లీన్ షేవ్ చేసుకోవడం లాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయని టాక్.

ప్రేక్షకుల రిసీవింగ్.. శ్రీ విష్ణు మీసం తిప్పుతారా?
డిఫెరెంట్ సినిమాలు చేయడంలో తనకు సాటెవ్వరూ రారని ఇప్పటికే పలు సినిమాలతో నిరూపించాడు శ్రీ విష్ణు. మళ్ళీ ఇప్పుడు అదే బాటలో 'తిప్పరా మీసం' అన్నాడు. ఈ సినిమాతో శ్రీ విష్ణు నిజంగానే మీసం తిప్పుతారా? అనేది తెలియాలంటే మరి కొన్ని షో పడాలి మరి.


Click it and Unblock the Notifications











