నేరుగా ఓటీటీలో ‘రాజ రాజ చోర’ రిలీజ్: ఎందులో స్ట్రీమింగ్ కాబోతుందో తెలుసా?

విలక్షణ నటనతో, వైవిధ్యమైన సినిమాలు చేస్తూ తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకున్నాడు యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శ్రీ విష్ణు. సహజ సిద్ధమైన నటనతో ఎన్నో సినిమాలను వన్ మ్యాన్ షోగా మార్చుకున్నాడతను. ఈ క్రమంలోనే జయాపజయాలతో ఏమాత్రం సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. ఇప్పటికే ఈ ఏడాది 'గాలి సంపత్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అతడు.. ప్రస్తుతం 'రాజ రాజ చోర' అనే మూవీ చేస్తున్నాడు. తాజాగా దీని గురించి ఓ షాకింగ్ న్యూస్ ఫిలిం నగర్‌లో వైరల్ అవుతోంది.

నూతన దర్శకుడు హసిత్ గోలి డైరెక్షన్‌లో శ్రీ విష్ణు నటిస్తోన్న చిత్రమే 'రాజ రాజ చోర'. ఢిఫరెంట్ కాన్సెప్టుతో కామెడీ, ఎమోషన్స్‌ మేళవింపుతో తెరకెక్కుతోన్న ఈ సినిమా రిలీజ్ విషయంలో చిత్ర యూనిట్ డేరింగ్ స్టెప్ తీసుకుందట. తాజా సమాచారం ప్రకారం.. ఈ చిత్రాన్ని నేరుగా డిజిటల్ రిలీజ్ చేయబోతున్నారట. ఇందుకోసం ZEE సంస్థ ఊహించని ధరకు ఈ సినిమా హక్కులను సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో అతి త్వరలోనే ఈ మూవీ Zee5 ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతుందని సమాచారం. దీనికి సంబంధించిన ప్రకటన కొద్ది రోజుల్లోనే రానుందనే టాక్ బాగా వినిపిస్తోంది.

 Sree Vishnus Raja Raja Chora Will Be Release on Zee5 OTT

పూర్తి స్థాయి కామెడీ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న 'రాజ రాజ చోర' టీజర్ శుక్రవారమే విడుదలైంది. దీనికి అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వచ్చింది. ఫలితంగా చిత్రంపై అంచనాలు పెరిగిపోయాయి. ఇదిలా ఉండగా.. ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లపై టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. ఇందులో మేఘా ఆకాశ్ హీరోయిన్‌గా నటిస్తోంది. వివేక్ సాగర్ దీనికి సంగీతం అందిస్తున్నాడు. ఇందులో శ్రీ విష్ణు దొంగగా నటిస్తోన్న విషయం తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X