తిప్పరా మీసం టీజర్: మందు, సిగరెట్, అమ్మాయి.. నేను కూడా బానిసనే..
టాలీవుడ్ హీరోల్లోకెల్లా ప్రత్యేకమైన హీరో శ్రీ విష్ణు. కెరీర్ స్టార్టింగ్ నుంచే తన సినిమా అంటేనే ఓ ప్రత్యేకత ఉంటుందని నిరూపిస్తూ వస్తున్నాడు శ్రీ విష్ణు. ఈ కోవలోనే ఇటీవలే 'బ్రోచేవారెవరురా' సినిమాతో మరో సూపర్ డూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్న ఈ హీరో తాజాగా 'తిప్పరా మీసం' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
ఎప్పటిలాగే ఈ సినిమాలోను శ్రీవిష్ణు డిఫరెంట్ క్యారెక్టర్ చేస్తున్నాడు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను అతి త్వరలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు దర్శకనిర్మాతలు. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్స్ మొదలు పెట్టి చిత్ర టీజర్ విడుదల చేశారు. ఒక నిమిషం 27 సెకనుల నిడివితో కూడా ఈ టీజర్ సినిమాపై అంచనాలు పెంచేసింది.
'మందు సిగరెట్ అమ్మాయిలా.. శత్రువు కూడా వ్యసనమే.. ఆ వ్యసనానికి నేనూ బానిసనే' అంటూ టీజర్ లో శ్రీవిష్ణు చెప్పిన డైలాగ్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తోంది. ఇంకా టీజర్ లో చూపించిన కొన్ని సన్నివేశాలు సినిమా పట్ల ఆసక్తిని పెంచేలా ఉన్నాయి. గుబురు గడ్డం, రఫ్ హెయిర్ స్టైల్‌తో శ్రీవిష్ణు కనిపించాడు.

కృష్ణా విజయ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా నిక్కీ తంబోలీ, రోహిణి హీరోయిన్లుగా నటిస్తున్నారు. సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తున్నారు. శ్రీ ఓం బ్యానర్, రిజ్వాన్ ఎంటర్టైన్‌మెంట్స్ సంయుక్త సమర్పణలో రూపొందుతున్న ఈ చిత్రానికి రిజ్వాన్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.


Click it and Unblock the Notifications











