Samajavaragamana Twitter Review: 'సామజవరగమన'కు సూపర్బ్ రెస్పాన్స్.. వాళ్ల సినిమాల్లా ఉన్నాయంటూ!
టాలీవుడ్ ప్రామిసింగ్ హీరోల్లో శ్రీ విష్ణు ఒకరు. సినిమాల్లో ఫ్రెండ్స్, పెళ్లి కొడుకు, హీరో సిస్టర్ లవర్ వంటి చిన్న చిన్న పాత్రలు చేస్తూ హీరోగా తనను తాను ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు. మెంటల్ మదిలో సినిమా నుంచి పూర్తి స్థాయిలో హీరోగా మారిన శ్రీ విష్ణు నీది నాది ఒకే కథతో అలరించాడు. ఎక్కువగా ఫ్యామిలీ, కామెడీ చిత్రాలతో ఆకట్టుకున్న శ్రీ విష్ణు తాజాగా అదే జోనర్ లో సామజవరగమన సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. జూన్ 29న విడుదల కానున్న ఈ సినిమాకు రెండు రోజుల ముందే ప్రీమియర్స్ పడ్డాయి. మరి సామజవరగమన ప్రీమియర్స్ చూసిన నెటిజన్ల స్పందన ఎలా ఉందో ట్విటర్ రివ్యూలో చూద్దాం.
సందడి చేసేందుకు:బాణం, సోలో, నా ఇష్టం, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ వంటి తదితర సినిమాల్లో చిన్న పాత్రలు చేసుకుంటూ వచ్చిన శ్రీవిష్ణు మంచి హీరోగా పేరు తెచ్చుకున్నాడు. మెంటల్ మదిలో, నీది నాది ఒకే కథ సినిమాలతో హీరోగా మారాడు. ఇటీవల అల్లూరి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన శ్రీవిష్ణు తాజాగా సామజవరగమన మూవీతో బాక్సాఫీస్ వద్ద సందడి చేసేందుకు రెడీ అయ్యాడు.

ఎవరెవరు ఉన్నారంటే?:ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర సమర్పణలో రాజేష్ దండా నిర్మించిన సామజవరగమన చిత్రంలో మలయాళీ బ్యూటి రెబ్బ మోనికా జాన్ హీరోయిన్ గా చేస్తుంది. అలాగే వెన్నెల కిశోర్, వీకే నరేష్, దేవి ప్రసాద్, రాజీవ్ కనకాల తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ద్రిష్టి, వివాహభోజనంబు సినిమాలకు దర్శకత్వం వహించిన రామ్ అబ్బరాజు సామజవరగమన చిత్రాన్ని తెరకెక్కించారు.
రియాక్షన్స్:ఇక సామజవరగమన సినిమా నుంచి విడుదలైన ట్రైలర్, టీజర్లకు మంచి స్పందన వచ్చింది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమా జూన్ 29న అంటే గురువారం రిలీజుకు సిద్ధంగా ఉంది. విడుదలకు ముందే చాలా చోట్ల ప్రీమియర్ షోలు వేశారు. మరి శ్రీ విష్ణు లేటెస్ట్ మూవీ సామజవరగమనపై ఆడియెన్స్ ఎలా స్పందించారో తెలుసుకుందాం.
హిట్టు బొమ్మ:"హిలేరియల్ ఫన్ రైడ్. సందర్భానుసారంగా వచ్చిన కామెడీ ఎక్సలెంట్ గా ఉంది. ఫ్యామిలీతో హ్యాపీగా చూసేయొచ్చు. హిట్టు బొమ్మ" అని ఒక నెటిజన్ సోషల్ మీడియా వేదికగా రాసుకొచ్చాడు. "ఎంటర్టైనింగ్ సినిమా. శ్రీ విష్ణు, రెబ్బ మోనిక ఇద్దరు చాలా బాగా చేశారు. సపోర్టింగ్ క్యారెక్టర్స్ సూపర్బ్. రైటింగ్, మ్యూజిక్, బీజీఎమ్, స్క్రీన్ ప్లే, కామెడీ సీన్స్ అన్నీ అదిరిపోయాయి. కచ్చితంగా చూసే సినిమా" అంటూ 3.5 స్టార్ రేటింగ్ ఇచ్చారు ఒక యూజర్.
కామెడీ ఎంటర్టైనర్:"సూపర్ ఉంది సినిమా. ఫుల్ పన్. థియేటర్లో ఒక్కరు కూడా నవ్వకుండా ఉండలేరు. చాలా రోజుల తర్వాత ఒక మూవీని చాలా హార్ట్ ఫుల్ గా ఎంజాయ్ చేశా. ఫుల్ నవ్వుకున్నా. ఫస్టాఫ్ చాలా బాగుంది. ఇక సెకండాఫ్, క్లైమాక్స్ ట్విస్ట్ ఎక్సలెంట్ గా ఉంది. కచ్చితంగా కుటుంబంతో చూడాల్సిన కామెడీ ఎంటర్టైనర్" అని ఓ మీమ్ పేజ్ రివ్యూ ఇచ్చింది.
జబర్దస్త్ 20 ఎపిసోడ్స్:"వైజాగ్, విజయవాడల్లో ప్రీమియర్స్ చూసిన వాళ్ల నుంచి ఎక్సలెంట్ రెస్పాన్స్ వస్తుంది. 'ఈవీవీ సత్యనారాయణ గారి సినిమా చూసినట్లు ఉంది', 'జబర్దస్త్ 20 ఎపిసోడ్స్ లో ఉన్న కామెడీ ఈ ఒక్క సినిమాలో ఉంది', 'చాలా డేస్ తర్వాత వెంకటేష్ మూవీ చూసినట్టు అనిపిస్తుంది', 'విష్ణుకి బిగ్గెస్ట్ హిట్. మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్'" అని ఆడియెన్స్ మాట్లాడిన మాటలను తెలియజేసింది.
హిలేరియస్ కామెడీ:"సామజవరగమన సినిమా చూశాను. శ్రీ విష్ణు అదరగొట్టాడు. యాక్టంర్ నరేష్ గారి కామెడీ హిలేరియస్ గా ఉంది. అతని కామెడీ టైమింగ్ తో అందర్నీ నవ్వించారు. రామ్ అబ్బరాజు థియేటర్ లో మంచి ఎంటర్టైన్ మెంట్ అందించారు. ఈసారి ఆయన విజయం సాధించారు" అని మరొకరు తెలిపారు. ఇలా సామజవరగమన సినిమాకు అన్ని చోట్ల ఎంటర్టైన్ మెంట్ టాక్ వస్తోంది.


Click it and Unblock the Notifications











