త్రివిక్రమ్ పంచుల పనైపోయింది.. శ్రీవిష్ణు షాకింగ్ కామెంట్స్

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శ్రీవిష్ణు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నారు. ముఖ్యంగా శ్రీవిష్ణు కామెడీ కంటెంట్ తో సినిమా తర్వాత సినిమాను తీసుకొస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా #Single అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మే9న ఈ చిత్రం విడుదలైంది. అయితే మూవీ ప్రమోషన్స్ సందర్భంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ రైటింగ్ స్టైల్ పై స్పందించారు.

శ్రీవిష్ణు చివరి 5 చిత్రాలు..
చివరిగా ఓం భీమ్ బుష్, స్వాగ్ వంటి చిత్రాలతో థియేటర్లలోకి వచ్చారు. ఆడియెన్స్ ను ఓ మాదిరిగా అలరించారు. అంతుకు ముందు అర్జున ఫల్గునా, భళా తందనాన, అల్లూరి, సామజవరగమణ వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేశారు. కానీ పెద్దగా సక్సెస్ అందుకోలేకపోయారు. యావరేజ్ ఫిల్మ్స్ గా శ్రీవిష్ణు చిత్రాలు అలరిస్తూనే ఉన్నాయి. ఇక ప్రస్తుతం 'సింగిల్' చిత్రంతో అలరించేందుకు రెడీ అయ్యాడు.

Sree Vishnu Shocking Comment about Director Trivikram Srinivas Writing style

నాని తర్వాత శ్రీవిష్ణునే..
మే9న #Single చిత్రం రిలీజ్ కాబోతుండటంతో సినిమాను గట్టిగా ప్రమోట్ చేశారు శ్రీవిష్ణు. అయితే ప్రస్తుతం తమ సినిమాలను ప్రచారం చేసుకోవడంలో నాని డిఫరెంట్ ఫార్మాట్స్ ను ఫాలో అవుతున్నారు. ఇక అదే స్టైల్ లో శ్రీవిష్ణు కూడా సింగిల్ చిత్రాన్ని ఇంట్రెస్టింగ్ గా ప్రమోట్ చేశారు. మరోవైపు సినిమాలో ఎంత నవ్వించబోతున్నారో తన ప్రమోషన్స్ ద్వారా చూపించారు. ప్రేక్షకుల్లో సినిమాపై నమ్మకం కలిపించారు.

త్రివిక్రమ్ పై శ్రీవిష్ణు వ్యాఖ్యలు..
సింగిల్ చిత్రం ప్రమోషన్స్ లో భాగంగా శ్రీవిష్ణు బ్యాక్ టు బ్యాక్ ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యలో స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాల్లోని కామెడీ గురించి మాట్లాడుతూ వచ్చారు. అలాగే జంధ్యాల గారిని కూడా గుర్తు చేశారు. అయితే తన సినిమాల్లో కాస్తా బోల్డ్ కామెడీ ఉంటుందని అభిప్రాయాలు వస్తుండటంతో దానిపై ఇలా స్పందించారు. ప్రస్తుతం కామెడీ స్టైల్ మారిపోయిందని, కామెడీ పరిణామం చెందుతూ వస్తుందని చెప్పారు. ఒకప్పుడు జంధ్యాల కామెడీ సీన్లు, మొన్నటి వరకు త్రివిక్రమ్ శ్రీనివాస్ తన పంచులతో నవ్వించగలిగారు. కానీ ఇప్పుడు ఆ ఫార్మాట్ పనిచేయడం లేదని వివరించారు. ప్రస్తుతం ఆడియెన్స్ ను నవ్వించాలంటే రియల్ ఇన్సిడెంట్ నుంచే కామెడీని పుట్టించాల్సి వస్తోందని చెప్పారు. అందుకే తన సినిమాల్లో చాలా రెఫరెన్స్ లు తీసుకున్నట్టు చెప్పుకొచ్చారు.

సింగిల్ చిత్రం వివరాలు..
గీతా ఆర్ట్స్ బ్యానర్, కల్యా ఫిల్మ్స్ బ్యానర్లపై విద్య కొప్పినిడి, భాను ప్రతాప, రియాజ్ చౌదరి నిర్మాతలుగా #single చిత్రాన్ని నిర్మించారు. కేతికా శర్మ, ఇవానా హీరోయిన్లుగా నటించారు. కార్తీక్ రాజు దర్శకత్వం వహించారు. ప్రవీణ్ కేఎల్ ఎడిటర్ గా బాధ్యత వహించారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించారు. యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా, ఫన్ ఫిల్డ్ సినిమాగా థియేటర్లలోకి వచ్చింది. ఈ చిత్రంతో ఎలాగైనా శ్రీ విష్ణు మంచి హిట్ అందుకోవాలని చూస్తున్నారు. సినిమాను గట్టిగాన ప్రమోట్ చేశారు. మరి ఎలాంటి రిజల్ట్ ను అందుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.

More from Filmibeat

Read more about: sree vishnu trivikram tollywood
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X