HBD Sree Vishnu: సర్‌ప్రైజ్ చేసిన శ్రీ విష్ణు.. ఊహించని విధంగా స్వాగ్ వీడియో

తెలుగు సినీ ఇండస్ట్రీలో టాలెంట్ ఉన్న హీరోలు చాలా మందే ఉన్నారు. కానీ, అందులో కొందరు మాత్రమే ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకుని సత్తా చాటుతున్నారు. అలాంటి వారిలో శ్రీ విష్ణు ఒకడు. క్యారెక్టర్ ఆర్టిస్టు నుంచి హీరోగా మారిన అతడు.. తనదైన సినిమాలతో అలరిస్తున్నాడు. ఇలా ఎన్నో ప్రయోగాలు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే 'సామజవరగమన'తో హిట్ కొట్టాడు.

'సామజవరగమన' సక్సెస్ తర్వాత ఫుల్ జోష్‌లో ఉన్న శ్రీ విష్ణు ఇప్పుడు పలు ప్రాజెక్టులను చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతోన్నాడు. అలా ఇప్పుడు అతడు లైన్‌లో పెట్టుకున్న చిత్రాల్లో హసిత్ గోలి రూపొందిస్తున్న మూవీ ఒకటి. 'రాజ రాజ చోర' వంటి డీసెంట్ హిట్ తర్వాత వీళ్లిద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై ఆరంభం నుంచే అందరూ ఫోకస్ చేశారు.

Sree Vishnu Starrer SWAG Movie Title Story Video Released

శ్రీ విష్ణు - హసిత్ గోలి కాంబినేషన్‌లో రూపొందుతోన్న ఈ చిత్రానికి 'స్వాగ్' (SWAG) అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోను తాజాగా విడుదల చేశారు. నేడు హీరో శ్రీ విష్ణు పుట్టినరోజును పురస్కరించుకుని దీన్ని వదిలారు. ఇక, ఈ వీడియోలో అసలు స్వాగ్ టైటిల్ వెనుక ఉన్న కథను ఎవరూ ఊహించని విధంగా ఫన్నీగా చెప్పే ప్రయత్నం చేశారు.

ఓ బాబు 'మంచి సినిమాలు ఏమీ లేవు బోర్ కొడుతుంది' అని అంటుంది. అప్పుడు సునీల్ వాయిస్‌తో 'ఏ ఏం చూస్తావురా సినిమాల్లో కథలేగా? ఆ కథను నేనే చెప్తాలే' అని వస్తుంది. తర్వాత ఆ బాబు కార్టూన్ చానెల్ పెట్టుకుని చూస్తుంటే అందులో జంతువులు అన్నీ 'మా లైఫ్ చాలా బోరింగ్‌గా ఉంది' అంటూ అరుస్తుంటాయి. అప్పుడు గంగవ్వ వాయిస్‌తో వచ్చిన ఓ మంకీ వచ్చి కథలు చెప్దాం అంటుంది.

ఆ తర్వాత అన్ని జంతువులు ఆసక్తిగా ఎదురు చూస్తుండగా తన ఫ్యామిలీ స్టోరీని ఆ మంకీ చెప్తుంది. చివర్లో చాలా సస్పెన్స్ తర్వాత తమ వంశం పేరే ఈ కథ పేరు అని చెప్పి టైటిల్‌ను రివీల్ చేస్తుంది. మొత్తంగా ఈ వీడియో ఎంతో ఫన్నీగా, ఆసక్తికరంగా సాగింది. గతంలో ఇలాంటిది టాలీవుడ్‌లో ఎప్పుడూ రాలేదు. దీంతో ఇది తక్కువ సమయంలోనే వైరల్‌గా మారిపోయింది.

ఇదిలా ఉండగా.. శ్రీ విష్ణు హీరోగా హసిత్ గోలి తెరకెక్కిస్తోన్న 'స్వాగ్' మూవీని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్నారు. దీనికి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. దీనికి వివేక్ సాగర్ దీనికి సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్, నటీనటుల వివరాలు తెలియాల్సి ఉన్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X