‘రాజ రాజ చోర’ డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ప్రకటన: శ్రీవిష్ణు మూవీ ఏ ఓటీటీలో రాబోతుందంటే!

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఉన్న చాలా తక్కువ మంది టాలెంటెడ్ హీరోల్లో పక్కింటి అబ్బాయిలా ఉండే శ్రీవిష్ణు ఒకడు. బ్యాగ్రౌండ్ లేకపోయినా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. చాలా తక్కువ సమయంలోనే విలక్షణమైన నటనతో విశేషమైన గుర్తింపును అందుకున్నాడు. అలా హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ఈ క్రమంలోనే ఎన్నో చిత్రాలను వన్ మ్యాన్ షోలుగా మార్చుకున్నాడు. అయితే, ఇటీవలే 'బ్రోచేవారెవరురా' వంటి విజయాన్ని అందుకున్నా.. శ్రీవిష్ణుకు భారీ సక్సెస్ మాత్రం అందనంత దూరంలోనే ఉండిపోయింది.

చాలా కాలంగా బిగ్గెస్ట్ హిట్ కోసం వేచి చూస్తోన్న శ్రీవిష్ణు.. ఈ ఏడాది ఆరంభంలోనే 'గాలి సంపత్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఎన్నో అంచనాల నడుమ వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ ముందు దారుణంగా బోల్తా పడింది. అయితే, నటుడిగా మాత్రం అతడికి ఈ చిత్రం బాగా ప్లస్ అయింది. అది ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో ఈ సారి పక్కాగా హిట్ కొట్టాలన్న పట్టుదలతో ఉన్నాడు శ్రీవిష్ణు. ఇందులో భాగంగానే ఇటీవల 'రాజ రాజ చోర' అనే సినిమా చేశాడు. నూతన దర్శకుడు హసిత్ గోలి తెరకెక్కించిన ఈ సినిమా ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందింది.

Sree Vishnus Raja Raja Chora Digital Streaming on ZEE5 From October 8th

మామూలుగా శ్రీవిష్ణు నటించిన సినిమా అంటే సామాన్య ప్రేక్షకుల్లో మంచి అభిప్రాయం ఉంటుంది. కచ్చితంగా అతడు వైవిధ్యమైన కథనే ఎంపిక చేసుకుంటాడని, యాక్టింగ్‌తో అదరగొడతాడని అంతా అనుకుంటారు. అలాగే 'రాజ రాజ చోర' విషయంలోనూ జరిగింది. దీంతో ఈ సినిమాపై ఆరంభం నుంచే అంచనాలు ఏర్పడ్డాయి. అదే సమయంలో టీజర్, ట్రైలర్ వాటిని రెట్టింపు చేసేశాయి. దీంతో దీనికి భారీ ఓటీటీ డీల్స్ కూడా వచ్చాయి. కానీ, ఈ చిత్రాన్ని థియేటర్లలోనే విడుదల చేశారు. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ మూవీ సూపర్ డూపర్ హిట్ అయింది. ఫలితంగా అతడి కెరీర్‌లోనే భారీ కలెక్షన్లు రాబట్టింది.

థియేటర్లలో సత్తా చాటిన 'రాజ రాజ చోర' మూవీ ఓటీటీలో ఎప్పుడు స్ట్రీమింగ్ అవుతుందా అని చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో చిత్ర యూనిట్ తాజాగా వాళ్లకు శుభవార్తను చెప్పింది. ఈ చిత్రాన్ని జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ చేయబోతున్నారు. అక్టోబర్ 8వ తేదీ నుంచి ఇది అందులో ప్రదర్శన కాబోతుంది. ఇక, ఈ సినిమా హక్కుల కోసం చిత్ర యూనిట్‌కు సదరు సంస్థ భారీ మొత్తం చెల్లించినట్లు కూడా ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, ఇది శ్రీవిష్ణు కెరీర్‌లోనే బిగ్గెస్ట్ డీల్ అన్న టాక్ కూడా జోరుగానే వినిపిస్తోంది.

ఈ మధ్య కాలంలో ఫన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన చిత్రం 'రాజ రాజ చోర'. నూతన దర్శకుడు హసిత్ గోలి తెరకెక్కించిన ఈ సినిమాలో మేఘా ఆకాశ్ హీరోయిన్‌గా నటించింది. వివేక్ సాగర్ దీనికి సంగీతం అందించాడు. పుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లపై టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మించారు. ఈ చిత్రం ఆగస్టు 19న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయింది. ఈ సినిమా వారం రోజుల్లోనే బ్రేక్ ఈవెన్‌ టార్గెట్‌ను చేరుకోవడంతో పాటు నిర్మాతలకు లాభాలను కూడా తెచ్చి పెట్టింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X