శ్రీకాంత్ అడ్డాల చేతిలో మరో రీమేక్.. లక్కు మాములుగా లేదు!

టాలెంటెడ్ డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల ఎలాంటి సినిమా చేసినా కూడా ఒక డిఫెరెంట్ టైమింగ్ తో ఉంటాయి. వీలైనంత వరకు చాలా సింపుల్ విషయాలను హైలెట్ చేస్తూ ఆకట్టుకునేలా చెప్పడానికి ప్రయత్నం చేస్తాడు. ఆయన కరెక్ట్ కథను సెట్ చేసుకోగలిగితే పవర్ఫుల్ బాక్సాఫీస్ హిట్ అందుకోగలడని చెప్పవచ్చు. అందుకే ఈ మధ్య మంచి మంచి రీమేక్ కథలు అతని చేతికి వస్తున్నాయి.

మహేష్ బాబుతో చేసిన బ్రహ్మోత్సవం డిజాస్టర్ దెబ్బకు కొన్నాళ్ళు శ్రీకాంత్ ను ఎవరు పట్టించుకోలేదు. ఎన్ని కథలు చెప్పినా కూడా వర్కౌట్ కాలేదు. చివరికి వెంకటేష్ అతని మీద నమ్మకంతో అసురన్ రీమేక్ చేసే బాధ్యతలు అప్పగించారు. ఆ సినిమాను పర్ఫెక్ట్ గా రీమేక్ చేసినట్లు టాక్ వస్తోంది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా తీసినప్పుడు వెంకటేష్ అతని టాలెంట్ ను పసిగట్టాడు. అందుకే ఆ ఛాన్స్ ఇచ్చాడు.

 Sreekanth addala another tamil remake movie with bellam konda hero

ఇక శ్రీకాంత్ అడ్డాలకు మరో తమిళ్ రీమేక్ చేసే ఛాన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ధనుష్ కర్ణన్ సినిమాను రీమేక్ చేయాలని ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఆ సినిమాను డైరెక్ట్ చేసే బాధ్యతను శ్రీకాంత్ అడ్డాలకు ఇచ్చినట్లు టాక్ వస్తోంది.

ప్రస్తుతం చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. అయితే శ్రీకాంత్ అడ్డాల కొంచెం కన్ఫ్యూజన్ లో ఉన్నట్లు టాక్. వెంటనే మరొక రీమేక్ సినిమా చేయకుండా తనదైన స్టైల్ లో ఒక ఫ్యామిలీ కథను డైరెక్ట్ చేయాలని అనుకుంటున్నాడు. మరి కర్ణన్ ఎప్పుడు సెట్స్ పైకి వస్తుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X