నారప్ప పైనే శ్రీకాంత్ అడ్డాల ఆశలు.. హిట్ టాక్ వస్తే మరో రెండు ఆఫర్లు!
ఫ్యామిలీ ఎమోషన్స్ తో సింపుల్ కథలతో మ్యాజిక్ క్రియేట్ చేయగల దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల మొదటిసారి తన బార్డర్ ను దాటేసి నారప్ప లాంటి హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాను టచ్ చేశాడు. ట్రైలర్ చూసిన తరువాత అసలు ఈ సినిమాను నిజంగా ఈ దర్శకుడే తెరకెక్కించాడా అనేంతలా ఆశ్చర్యపరిచాడు. ఇక సోమవారం నుంచి అమెజాన్ ప్రైమ్ లో సందడి చేసే నారప్ప ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంటుందా అని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
ఎందుకంటే ఇప్పటివరకు వెంకటేష్ లాంటి సీనియర్ హీరోల సినిమాలు డైరెక్ట్ గా ఓటీటీలో విడుదల కాలేదు. దీంతో ఇండస్ట్రీలో కూడా సినిమా రిజల్ట్ కోసం అందరూ ఆసక్తిగా వేయిట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావాలని దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల చాలా బలంగా కోరుకుంటున్నాడు. ఎందుకంటే ఈ సినిమా సక్సెస్ టాక్ ను సొంతం చేసుకుంటే అతనికి మరో రెండు ఆఫర్లు ఈజీగా వచ్చినట్లే అని చెప్పవచ్చు. ముందుగా తన సొంత కథను గీత ఆర్ట్స్ లో ఫైనల్ చేసుకోవచ్చు. ఒక స్టార్ హీరోతో చేయాలనుకుంటున్న ఆ సినిమాకు 'అన్నాయ్' అనే టైటిల్ ను కూడా ఫిక్స్ చేసుకున్నాడు.

ఇక ఆ సినిమా అనంతరం శ్రీకాంత్ వద్దకు కర్ణన్ రీమేక్ ఆఫర్ కూడా వచ్చింది. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా ఆ సినిమాను తెరకెక్కించాలని చూస్తున్నారు. ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో కర్ణన్ కూడా సెట్టయ్యే అవకాశం ఉందని అయితే దాని మీద కూడా వర్క్ చేశాక అఫీషియల్ గా క్లారిటీ వస్తుందని అన్నాడు. అయితే నారప్ప హిట్టయితేనే శ్రీకాంత్ కు రెండు ఆఫర్స్ రావడానికి మార్గం సులువవుతుంది. మరి నారప్ప ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications











