శ్రీకారం ప్రీ రిలీజ్ ఈవెంట్: చిరంజీవికి గ్రాండ్ వెల్‌కమ్.. హోరెత్తిన ఖమ్మం
యువ హీరో శర్వానంద్ నటించిన శ్రీకారం చిత్రం ప్రీ రిలీజ్ వేడుక ఖమ్మం పట్టణంలో ఘనంగా జరుగుతున్నది. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి, రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ వేడుకలో హీరో శర్వానంద్, హీరోయిన్ ప్రియా అరుల్ మోహన్, మాటల రచయిత బుర్రా సాయిమాధవ్, సినిమా యూనిట్ హజరయ్యారు. ఈ వేడుకలో పాల్గొనేందుకు మెగాస్టార్ వేడుక ప్రాంగణంలోకి అడుగుపెట్టగానే అభిమానులు, సినీ ప్రేక్షకులు కేరింతలతో స్వాగతం పలికారు.
శ్రీకారం సినిమా వేడుకకు హాజరైన భారీ ప్రేక్షక సందోహాన్ని చూసి చిరంజీవి అభివాదం చేయగానే మెగాస్టార్‌కు గ్రాండ్‌గా స్వాగతం పలికారు. చిరంజీవిని చూడగానే అభిమానుల్లో ఆనందం ఉప్పొంగింది.శ్రీకారం సినిమా విషయానికి వస్తే.. బీ కిషోర్ తొలి చిత్ర దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.

నటీనటులు: శర్వానంద్, ప్రియాంక అరుల్ మోహన్, రావు రమేష్, ఆమని, నరేష్, సాయి కుమార్, మురళీ శర్మ, సత్య, సప్తగిరి తదితరులు
సంగీతం: మిక్కీ జే మేయర్
డీవోపీ: జే జయరాజ్
ఎడిటింగ్: మార్తాండ్ కే వెంకటేష్
డైలాగ్స్: సాయి మాధవ్ బుర్రా
ఆర్ట్: అవినాష్ కోళ్ల
నిర్మాత: రాం ఆచంట, గోపి ఆచంట
బ్యానర్: 14 రీల్స్ బ్యానర్



Click it and Unblock the Notifications











