SSMB28: లక్కీ ఛాన్స్ పట్టేసిన కుర్ర హీరోయిన్.. మహేశ్ బాబుతో రొమాంటిక్‌గా!

తెలుగు సినీ ఇండస్ట్రీలో సుదీర్ఘ కాలంగా హవాను చూపిస్తూ.. వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ సత్తా చాటుతోన్నాడు సూపర్ స్టార్ మహేశ్ బాబు. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో హిట్లు మీద హిట్లు కొడుతూ యమ ఫామ్‌లో కనిపిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఈ ఏడాదిలో 'సర్కారు వారి పాట' అనే కమర్షియల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దీనికి ఆశించిన రీతిలో కలెక్షన్లు రాకపోయినా ఈ మూవీ ఫలితంపై మహేశ్ బాబు సంతృప్తిగా ఉన్నాడు. ఈ ఉత్సాహంతోనే మరింత స్పీడుగా సినిమాలను లైన్‌లో పెట్టుకుంటూ ముందుకు సాగుతున్నాడు.

సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ఫుల్ లెంగ్త్ కమర్షియల్ జోనర్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోంది. ఈ సినిమాకు సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్ కొద్ది రోజుల క్రితమే ప్రారంభం అయింది. ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్‌లో అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్‌ను షూట్ చేసుకున్నారు. ఈ పార్ట్ మొత్తం సూపర్బ్‌గా వచ్చినట్లు తెలిసింది. ఇక, దీనికి సంబంధించిన కొత్త షెడ్యూల్‌ను డిసెంబర్ మొదటి వారం నుంచి మొదలెట్టేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ నుంచి అదిరిపోయే న్యూస్ వైరల్ అవుతోంది.

Sreeleela Confirm for Mahesh and Trivikram Movie

స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేశ్ బాబు రూపొందిస్తోన్న సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా చేస్తోంది. ఈమెతో పాటు మరో బ్యూటీని కూడా ఇందులో నటింపజేస్తారని అంటున్నారు. ఇందులో భాగంగానే ఎంతో మంది పేర్లు తెరపైకి వచ్చాయి. తాజా సమాచారం ప్రకారం.. ఈ చిత్రంలో కుర్ర హీరోయిన్, పెళ్లి సందD ఫేం శ్రీలీలా కూడా నటిస్తున్నట్లు తెలిసింది. వాస్తవానికి ఈ పాత్ర కోసం ప్రియాంక అరుల్ మోహన్‌ను తీసుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ, గురూజీ మాత్రం శ్రీలీలాకే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది.

ఈ చిత్రాన్ని హారిక హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే ఇందులో హీరోయిన్‌గా చేస్తోంది. థమన్ దీనికి సంగీతం అందిస్తున్నాడు. ఇక, దీనికి 'అర్జునుడు', 'అతడే పార్థు' వంటి టైటిళ్లు పరిశీలిస్తున్నారు. ఇక, ఈ మూవీలో ఎంతో మంది ప్రముఖులు కీలక పాత్రలను పోషిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X