SSMB28: కుర్ర హీరోయిన్‌తో మహేశ్ రొమాన్స్.. ఒక్క సినిమాకే బంపర్ ఆఫర్ పట్టేసిందిగా!

'భరత్ అనే నేను', 'మహర్షి', 'సరిలేరు నీకెవ్వరు' వంటి హ్యాట్రిక్ హిట్లను తన ఖాతాలో వేసుకుని గతంలో ఎన్నడూ లేనంత ఫుల్ జోష్‌తో కనిపిస్తున్నాడు టాలీవుడ్ బడా హీరో సూపర్ స్టార్ మహేశ్ బాబు. హిట్లు మీద హిట్లు సొంతం అవడంతో రెట్టించిన ఉత్సాహంతో సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. ఇప్పటికే పరశురాం దర్శకత్వంలో 'సర్కారు వారి పాట' అనే మూవీని మొదలు పెట్టిన ఈ స్టార్ హీరో.. అది షూటింగ్ జరుగుతోన్న సమయంలోనే దర్శకధీరుడు రాజమౌళితో ప్రాజెక్టును కూడా ప్రకటించేశాడు. ఇది ప్రారంభం అవడానికి చాలా సమయం ఉండడంతో దీని కంటే ముందు మరో సినిమాను చేయాలని ప్లాన్ చేసుకున్నాడు.

'సర్కారు వారి పాట' మూవీ షూటింగ్ జరుగుతుండగానే సూపర్ స్టార్ మహేశ్ బాబు.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో సినిమాను అనౌన్స్ చేశాడు. క్రేజీ కాంబినేషన్ కావడంతో ఈ ప్రాజెక్టుపై ఆరంభం నుంచే అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే దీని నుంచి ఎన్నో ఊహించని విషయాలు బయటకు వస్తున్నాయి. దీంతో అప్పుడే ఇది అందరి దృష్టినీ ఆకర్షించింది. ఇక, ఈ సినిమాఈ సినిమాకు సంబంధించిన డైలాగ్ వెర్షన్‌ను కూడా ఎప్పుడో పూర్తి చేసుకున్న త్రివిక్రమ్.. కాస్టింగ్‌ను కూడా దాదాపుగా పూర్తి చేశాడనే టాక్ ఫిలిం నగర్ ఏరియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

Sreeleela Fix for Mahesh Babu and Trivikram Movie

త్రివిక్రమ్ శ్రీనివాస్ - సూపర్ స్టార్ మహేశ్ బాబు కాంబినేషన్‌లో రాబోయే సినిమాలో నటించేందుకు గానూ బుట్టబొమ్మ పూజా హెగ్డేను లీడ్ హీరోయిన్‌గా తీసుకున్నారు. ఇక, ఇప్పుడు మరో బ్యూటీని కూడా ఇందులో నటింపజేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట. త్రివిక్రమ్ తెరకెక్కించే చిత్రాల్లో ఇద్దరు హీరోయిన్లు ఉండడం సర్వసాధారణమే. ఇందులో భాగంగానే మహేశ్ బాబుతో చేసే సినిమాలో పూజా హెగ్డేతో పాటు మరో భామను కూడా తీసుకుంటున్నారని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే నభా నటేష్, మీనాక్షి చౌదరి వంటి వాళ్ల పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. కానీ, ఎవరినీ చిత్ర యూనిట్ కన్ఫార్మ్ చేయలేదు.

క్రేజీ కాంబినేషన్‌లో రాబోతున్న ఈ సినిమాలో నటించే సెకెండ్ హీరోయిన్ గురించి తాజాగా మరో న్యూస్ బయటకు వచ్చింది. ఈ క్రమంలోనే ఊహించని హీరోయిన్ పేరు వెలుగులోకి వచ్చింది. తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో కీలక పాత్ర కోసం పెళ్లి సందడి ఫేమ్ శ్రీలీలను తీసుకుంటున్నారట. ఇప్పటికే ఆ చర్చలు కూడా ముగిశాయని టాక్. దీంతో ఈ బ్యూటీ పేరు ఫిలిం నగర్ ఏరియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. కేవలం ఆమె ఇప్పటి వరకూ ఒకే ఒక్క సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చేరువైంది. అయినప్పటికీ ఇప్పుడు భారీ ఆఫర్ పట్టేసిందని మాట్లాడుకుంటున్నారు.

'అతడు', 'ఖలేజా' తర్వాత త్రివిక్రమ్ - మహేశ్ బాబు కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందనున్న ఈ సినిమాలో హీరో రా ఏజెంట్‌గా కనిపిస్తాడని అంటున్నారు. ఈ చిత్రాన్ని హారిక హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఇక, ఈ మూవీకి 'పార్థు', 'అతడే పార్థు' అనే టైటిళ్లు పరిశీలనలో ఉన్నాయని తెలుస్తోంది. దీనికి ఎడిటర్‌గా నవీన్ నూలి, ఆర్ట్ డైరెక్టర్‌గా ఏఎస్ ప్రకాశ్, కెమెరామెన్‌గా మథి, మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎస్ థమన్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X