Sreeleela: ప్రభాస్‌తో లక్కీ ఛాన్స్ పట్టేసిన శ్రీలీల.. బాలీవుడ్ భామలకే షాకిచ్చేలా!
తెలుగు చిత్ర పరిశ్రమలో ఇప్పుడు హీరోయిన్ల మధ్య భారీ స్థాయిలో పోటీ నెలకొంది. అయినప్పటికీ చాలా మంది భామలు స్టార్‌డమ్‌ను సొంతం చేసుకుని సత్తా చాటుతున్నారు. ఇలాంటి వాళ్లందరికీ షాకిచ్చేలా వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది యంగ్ సెన్సేషన్ శ్రీలీల. అందానికి అందం, నటనకు నటనతో మెప్పిస్తున్న ఈ భామ.. ఎవరికీ సాధ్యం కాని రీతిలో ఆఫర్లను పట్టేస్తుంది.
ప్రస్తుతం శ్రీలీల చేతి నిండా చిత్రాలతో ఫుల్ బిజీగా గడుపుతోంది. అందులో కొన్ని భారీ చిత్రాలు ఉండగా.. మరికొన్ని మిడ్ రేంజ్ మూవీలు కూడా ఉన్నాయి. ఇలా ఈ అమ్మడు ఇప్పుడు దాదాపు పది చిత్రాల వరకూ చేస్తోంది. అయినప్పటికీ మరిన్ని ప్రాజెక్టులను సైతం లైన్‌లో పెట్టేందుకు రెడీ అవుతోంది. ఈ క్రమంలోనే తాజాగా శ్రీలీల మరో బంపర్ ఆఫర్ పట్టేసినట్లు తెలిసింది.

ఇప్పటికే 'సలార్', 'ప్రాజెక్టు కల్కి', 'స్పిరిట్'తో పాటు మారుతితో సినిమాను చేస్తున్న ప్రభాస్.. 'సీతా రామం' దర్శకుడు హను రాఘవపూడితో కూడా ఓ మూవీ చేయబోతున్నట్లు ఇటీవలే న్యూస్ లీకైన విషయం తెలిసిందే. ఇందులో హీరోయిన్‌గా శ్రీలీలను ఎంపిక చేశారని తాజాగా తెలిసింది. ఇప్పటికే ఈ స్టోరీని సదరు దర్శకుడు ఆమెకు వినిపించగా.. వెంటనే ఒప్పుకుందని టాక్.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ - హను రాఘవపూడి కాంబినేషన్‌లో రాబోయే సినిమా ప్యూర్ లవ్ స్టోరీతో తెరకెక్కనుందని ఇప్పటికే స్పష్టత వచ్చింది. ఇందులో హీరోయిన్ రోల్‌కు ఎంతో ప్రాధాన్యత ఉంటుందట. ఇందుకోసం ఎవరైనా బాలీవుడ్ హీరోయిన్‌ను తీసుకోవాలని చిత్ర యూనిట్ భావించింది. కానీ, వాళ్లను కాదని ఇప్పుడు శ్రీలీలకు జై కొట్టారనే టాక్ గట్టిగానే వినిపిస్తోంది.

ఇక, ఈ చిత్రానికి సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్‌ను ఈ ఏడాది డిసెంబర్ నెల నుంచి మొదలు పెట్టబోతున్నారట. అంతకంటే ముందు అంటే ప్రభాస్ పుట్టినరోజైన అక్టోబర్ 23వ తేదీన ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వస్తుందని తెలిసింది. నవంబర్‌లో పూజా కార్యక్రమాలను జరిపేసి.. మొత్తానికి డిసెంబర్‌లో పట్టాలెక్కించబోతున్నారని తెలుస్తోంది.

ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి తెరకెక్కించబోయే సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్ నిర్మించబోతున్నారు. దీన్ని కూడా పాన్ ఇండియా రేంజ్‌లోనే ఐదు భాషల్లో రూపొందిస్తారని తెలిసింది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతున్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











