VD12: సెన్సేషనల్ బ్యూటీతో విజయ్ దేవరకొండ రొమాన్స్.. హాట్ టాపిక్‌గా కొత్త జోడీ

ఏమాత్రం బ్యాగ్రౌండ్ లేకుండానే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. 'పెళ్లి చూపులు' అనే సినిమాతో హీరోగా పరిచయమై.. ఆరంభంలోనే భారీ విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు క్రేజీ బాయ్ విజయ్ దేవరకొండ. ఆరంభంలోనే ఎన్నో హిట్లను సొంతం చేసుకున్న అతడు.. తక్కువ సమయంలోనే స్టార్‌గా ఎదిగిపోయాడు. దీంతో ఫాలోయింగ్‌ను, మార్కెట్‌ను భారీ స్థాయిలో పెంచుకుని సత్తా చాటాడు. అయితే, ఈ మధ్య కాలంలో మాత్రం విజయ్ దేవరకొండ వరుస పరాజయాలతో ఇబ్బంది పడుతోన్నాడు. దీంతో ఈ సారి ఎలాగైనా విజయాన్ని అందుకోవాలన్న కసితో కనిపిస్తున్నాడు.

ప్రస్తుతం విజయ్ దేవరకొండ.. శివ నిర్వాణ దర్శకత్వంలో 'ఖుషి' అనే సినిమాను చేస్తున్నాడు. సమంత రూత్ ప్రభు హీరోయిన్‌గా చేస్తోన్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతానికి నిలిచిపోయింది. దీంతో ఈ యంగ్ స్టార్ హీరో తన 12వ సినిమాను 'జెర్సీ' ఫేం గౌతమ్ తిన్ననూరితో చేస్తున్నట్లు ప్రకటించాడు. ఈ మేరకు ఇటీవలే ఓ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. ఇందులో పోలీస్ యూనిఫామ్‌లో ఓ వ్య‌క్తి ముఖానికి ముసుగు ధ‌రించి ఉండ‌టం ఆస‌క్తిని రేకెత్తించింది. అలాగే, నేను ఎక్క‌డివాడినో, ఎవ‌రిని మోసం చేశాను తెలియ‌దు అంటూ పోస్ట‌ర్‌పై రాశారు. అలాగే, బ్యాగ్రౌండ్ కూడా ఆకట్టుకునే విధంగా తీర్చిదిద్దారు.

 Sreeleela Fix for Vijay Devarakonda and Gowtam Tinnanuri Movie

క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన నటించే హీరోయిన్ గురించి ఎన్నో రకాల ప్రచారాలు జరుగుతోన్నాయి. ఈ క్రమంలోనే ఎంతో మంది బాలీవుడ్, టాలీవుడ్ బ్యూటీల పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. అయితే, తాజా సమాచారం ప్రకారం.. ఇందులో సెన్సేషనల్ హీరోయిన్ శ్రీలీలను ఫైనల్ చేశారని తెలిసింది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ ఈ రెండు మూడు రోజుల్లోనే అధికారికంగా ప్రకటించబోతుందని సమాచారం. ఇక, బిగ్ స్క్రీన్‌పై విజయ్ - శ్రీలీల జోడీ చూడముచ్చటగా ఉంటుందని అంతా అనుకుంటున్నారు.

 Sreeleela Fix for Vijay Devarakonda and Gowtam Tinnanuri Movie

స్పై థ్రిల్లర్ జోనర్‌లో రాబోతున్న ఈ సినిమాను సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ , ఫార్ఛ్యూన్ ఫోర్ ప‌తాకాల‌పై నాగ‌వంశీ , సాయి సౌజ‌న్య నిర్మిస్తున్నారు. అలాగే, ఈ చిత్రానికి కోలీవుడ్ సెన్సేషన్ అనిరుథ్ రవిచందర్ సంగీతాన్ని అందిస్తున్నాడని ప్రచారం జరుగుతోంది. మొత్తానికి ఈ చిత్రంపై అంచనాలు తారాస్థాయిలోనే ఉన్నాయని చెప్పొచ్చు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X