శ్రీలీలను లాక్కెళ్లిపోయిన ఆకతాయిలు .. జస్ట్ మిస్, వణికిపోయిన కిస్సిక్ బ్యూటీ

భారతదేశంలో సినిమా ఒక మతమైతే.. నటీనటులను దేవుళ్లతో సమానంగా పూజిస్తారు అభిమానులు. తారలకు గుడి కట్టి పూజించే దేశం మనది. సినిమాల రిలీజ్‌ల నాడు థియేటర్లను ముస్తాబు చేయడంతో పాటు తమ అభిమాన తారల పుట్టిన రోజుల నాడు అన్నదానం, రక్తదానం , ఇతర సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతుంటారు అభిమానులు. అయితే ఇదంతా నాణేనికి ఓ వైపు మాత్రమే.. కొందరు ఆకతాయిలు బహిరంగ ప్రదేశాల్లో నటీనటుల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తుంటారు. తాజాగా ఆకతాయి చేసిన పనికి వణికిపోయారు యంగ్ బ్యూటీ శ్రీలీల.

పెళ్లిసందD సినిమా సమయంలో శ్రీలీలపై ఎవ్వరికీ పెద్ద అంచనాలు లేవు.. ఒకటి రెండు సినిమాలు చేసుకుని వెళ్లిపోతుందిలే అనుకున్నారంతా. కట్ చేస్తే ప్రస్తుతం టాలీవుడ్‌లో శ్రీలీల హవా నడుస్తోంది. ధమాకా సినిమా నుంచి శ్రీలీల కెరీర్ టర్న్ అయ్యింది. అందం, డ్యాన్స్‌లతో యూత్‌ని ఫిదా చేస్తూ వరుసపెట్టి ఆఫర్లు అందుకుంటోంది శ్రీలీల. ఇక్కడే అదృష్టమే ఆమెను కాపాడుతూ వస్తోంది. శ్రీలీల చేసిన స్కంధ, ఆదికేశవ, ఎక్స్‌ట్రార్డినరీ మేన్, గుంటూరు కారం వంటి చిత్రాలు దారుణంగా ఫ్లాప్ అయ్యాయి.

Sreeleela forcibly pulled into crowd during Aashiqui 3 shoot with kartik aaryan

లుక్స్, ఎక్స్‌ప్రెషన్స్, స్టెప్పులు, నటనలో ఏమాత్రం కొత్తదనం లేదు. అయినప్పటికీ శ్రీలీలకు అదృష్టం కలిసొస్తూనే ఉంది. బాలయ్య భగవంత్ కేసరి పర్వాలేదని అనిపించుకుంది. ఆ వెంటనే అల్లు అర్జున్ - సుకుమార్‌ల మోస్ట్ అవైటెడ్ మూవీ పుష్ప 2లో ఐటెం సాంగ్ కోసం సుక్కూ వెతుకుతున్నప్పుడు చాలా మంది హీరోయిన్ల పేర్లు బయటికి వచ్చాయి. కానీ వారందరినీ దాటుకుని శ్రీలీలకు ఈ సాంగ్ చేసే అవకాశం కల్పించాడు సుకుమార్. కిస్సిక్ అంటూ సాగే ఈ పాటలో అల్లు అర్జున్‌తో కలిసి డ్యాన్స్ ఇరగదీసిన శ్రీలీలకు జాతీయ స్థాయిలో పేరొచ్చింది.

ఒక్క హిట్ వచ్చింది అనుకునేలోపు నితిన్ సరసన చేసిన రాబిన్‌హుడ్ ఫ్లాప్ అయ్యింది. ప్రస్తుతం రవితేజ సరసన మాస్ జాతరలో నటిస్తోంది. ఈ సమయంలోనే తన బాలీవుడ్ ఎంట్రీ కూడా కన్ఫర్మ్ చేసిన శ్రీలీల ఎక్కువగా ముంబైలోనే గడుపుతోంది. సైఫ్ అలీఖాన్ కుమారుడు ఇబ్రహీం అలీఖాన్‌తో కనిపించింది. ఈ లోపే బాలీవుడ్‌లో తన తొలి చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. అనురాగ్ బసు దర్శకత్వంలో కార్తీక్ ఆర్యన్‌కు జోడీగా నటిస్తోంది శ్రీలీల. టీ- సిరీస్ అధినేత భూషణ్ కుమార్ నిర్మాణంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాను ఈ ఏడాది దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ డార్జిలింగ్‌లో జరుగుతుండగా శ్రీలీలకు చేదు అనుభవం ఎదురైంది. షూటింగ్ నుంచి తిరిగి వస్తుండగా శ్రీలీల- కార్తీక్ ఆర్యన్‌లను చూసేందుకు స్థానికులు , యువత ఎగబడ్డారు. ఈ క్రమంలో కార్తీక్ ముందు నడుస్తుండగా అతని వెనుక శ్రీలీల ప్రజలకు అభివాదం చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో కొంతమంది ఆకతాయిలు శ్రీలీలను చేయి పట్టుకుని పక్కకి లాగారు. ఊహించని పరిణామంతో శ్రీలీల షాకై వారిని విడిపించుకునేందుకు యత్నించారు. ఇంతలో అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది ఆమెను రక్షించి పక్కకి తీసుకొచ్చారు. ఈ పరిణామంతో శ్రీలీల వణికిపోయారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X