మెగా ఇంటిలోకి చిట్టి తల్లి.. రాంచరణ్, ఉపాసనకు కంగ్రాట్స్.. శ్రీలీల, ఎన్టీఆర్, మహేష్, అల్లు అర్జున్ ట్వీట్లు
మెగా కుటుంబంలోకి చిన్నారి చిట్టితల్లి అడుగుపెట్టడంతో ఆ కుటుంబంలో ఆనందోత్సవాలు ఉప్పొంగుతున్నాయి. మెగా పవర్ స్టార్ రాంచరణ్, ఉపాసన దంపతులు పండంటి ఆడబిడ్డకు జన్మనివ్వడంతో అభిమానులు, స్నేహితులు, సన్నిహితులు, శ్రేయోభిలాషుల్లో ఆనందం పొంగిపొర్లుతున్నది. ఈ క్రమంలో రాంచరణ్, ఉపాసన దంపతులకు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. ఎన్టీఆర్, మహేష్ బాబు, అల్లు అర్జున్, నాని, శ్రీలీల తదితరులు ఏమని శుభాకాంక్షలు తెలిపారనే విషయంలోకి వెళితే..

మెగా పవర్ స్టార్‌కు బిగ్ కంగ్రాట్స్: పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన రాంచరణ్, ఉపాసన కొణిదెల దంపతులకు బిగ్ కంగ్రాట్స్. వారి కుటుంబంలోకి కొత్త సభ్యురాలు రావడం చాలా హ్యాపీగా ఉంది. తల్లిదండ్రులుగా మారి.. కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్న వారిద్దరికి స్వాగతం అంటూ సూపర్ స్టార్ మహేష్ బాబు ట్వీట్ చేశారు.
గర్వపడే తల్లిదండ్రులుగా: రాంచరణ్ ఉపాసన దంపతులు బ్యూటిఫుల్ అమ్మాయికి జన్మనిచ్చిందుకు హార్టీ కంగ్రాట్స్. వారిద్దరూ అందరూ గర్వపడే తల్లిదండ్రులుగా మారాలని కోరుకొంటున్నాను. చిట్టి ఏంజెల్ మీ జీవితంలో మరింత ప్రేమ, సంతోషాలను తీసుకొస్తుందనే నమ్మకం ఉంది అని యువ హీరోయిన్ శ్రీలీల ట్వీట్ చేసింది.
చిట్టి తల్లికి జన్మనిచ్చారనే..: రాంచరణ్, ఉపాసన దంపతులకు ఆడపిల్ల జన్మించిందనే విషయం తెలుసుకొన్న ఆయన స్నేహితుడు, సినీ నటుడు శర్వానంద్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. చిట్టి తల్లికి జన్మనిచ్చారనే విషయం తెలుసుకొని నా హృదయం సంతోషంతో నిండిపోయింది. లిటిల్ ప్రిన్సెస్‌ను ఎప్పుడెప్పుడూ చూడాలా అనే ఆతృతతో ఉన్నాను అని శర్వానంద్ ట్వీట్ చేశారు.
తాతగా మారిన చిరంజీవికి: చిన్నారి దేవతకు జన్మనిచ్చిన రాంచరణ్, ఉపాసన దంపతులకు అభినందనలు. తాతగా మారిన చిరంజీవికి శుభాకాంక్షలు. మెగా ఇంటిలోకి చిట్టి తల్లి అడుగుపెడుతున్న సమయంలో కుటుంబ సభ్యులందరికి శుభాకాంక్షలు. చిన్నారి పాపను దేవుడు చల్లగా చూడాలని మనస్పూర్తిగా కోరుకొంటున్నాను అని నాని ట్వీట్ చేశారు.
ఆనందంలో నాగబాబు: రాంచరణ్‌కు కూతురు పుట్టిందనే వార్త తెలియగానే బాబాయ్ నాగబాబు ఆనందంలో మునిగిపోయాడు. ఈ ప్రపంచంలోకి వచ్చిన చిన్ని తల్లికి సుస్వాగతం. ముందుగా రాంచరణ్, ఉపాపసన దంపతులకు అభినందనలు. మా జీవితాల్లోకి ఇంత మంచి ఆనందాన్ని తీసుకొచ్చిన చాలా సంతోషంగా ఉంది అంటూ నాగబాబు ట్వీట్ చేశారు.
బంగారం లాంటి హృదయం: మెగా ఫ్యామిలీలోకి చిన్నారి తల్లి అడుగుపెట్టడంతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఎమోషనల్ అయ్యారు. బంగారం లాంటి హృదయం ఉన్న నా స్వీటెస్ట్ బ్రదర్ రాంచరణ్, మంచి మనసు ఉన్న నా డియరెస్ట్ ఉపాసనకు అభినందనలు. చిరంజీవి, సురేఖ గారు తాత నానమ్మలైనందుకు సూపర్ హ్యాపీగా ఉంది అంటూ అల్లు అర్జున్ ట్వీట్ చేశారు.
చిన్నారి పాపతో గడిపే: పేరెంట్స్ క్లబ్‌లోకి వచ్చిన రాంచరణ్, ఉపాసన కొణిదెలకు స్వాగతం. పండంటి చిన్నారికి జన్మనిచ్చిన వారిద్దరికి శుభాకాంక్షలు. చిన్నారి పాపతో గడిపే ప్రతీ క్షణం జీవితంలో మరిచిపోలేనటువంటి అనుభూతిని కలిగిస్తాయి. మీ జీవితంలో సుఖ: సంతోషాలు ఉండాలని, చిన్నారి పాపకు దేవుడు ఆశీస్సులు ఉండాలని కోరుకొంటున్నాను అని ఎన్టీఆర్ ట్వీట్ చేశారు.


Click it and Unblock the Notifications











