పవన్‌కు జోడీగా సెన్సేషనల్ బ్యూటీ.. మరి ఆ హీరోయిన్ పరిస్థితి ఏంటబ్బా!
పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. ఈ పేరు ఒక సంచలనం. అంతలా ఈ స్టార్ హీరో దాదాపు రెండున్నర దశాబ్దాలుగా టాలీవుడ్‌లో బడా హీరోగా వెలుగొందడంతో పాటు తన రేంజ్‌ను క్రమంగా పెంచుకుంటూ దూసుకుపోతోన్నాడు. మరీ ముఖ్యంగా రీఎంట్రీలో రెట్టించిన జోష్‌తో కనిపిస్తోన్న ఈ మెగా హీరో.. ఏకధాటిగా సినిమాలు చేస్తూ అభిమానులను, సినీ ప్రియులను అలరిస్తున్నాడు. ఇలా ఇప్పటికే పలు చిత్రాలను అందించిన పవన్ కల్యాణ్.. ఇప్పుడు చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతోన్నాడు. అతడు ఇప్పుడు చేస్తున్న చిత్రాల్లో 'ఉస్తాద్ భగత్ సింగ్' ఒకటి.
'వకీల్ సాబ్' మూవీ షూటింగ్ జరుగుతున్నప్పుడే పవన్ కల్యాణ్.. హరీష్ శంకర్‌తో 'భవదీయుడు భగత్ సింగ్' అనే సినిమాను చేస్తున్నట్లు చెప్పాడు. కానీ, ఈ మూవీ మాత్రం ప్రారంభం కాలేదు. దీంతో ఈ ప్రాజెక్టు ఆగిపోయినట్లు ప్రచారం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో కొద్ది రోజుల క్రితమే దీన్ని 'ఉస్తాద్ భగత్ సింగ్' పేరుతో చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. అంతేకాదు, ఆరోజే పూజా కార్యక్రమాలను కూడా పూర్తి చేసి పుకార్లకు బ్రేక్ వేసేసింది. ఇక, తాజాగా ఈ మూవీ నుంచి అదిరిపోయే న్యూస్‌ను యూనిట్ సభ్యులు వెల్లడించి ఫ్యాన్స్‌కు ఖుషీ చేశారు.

పవన్ కల్యాణ్ - హరీష్ శంకర్ సినిమాకు పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుందని ప్రకటించారు. అయితే, ఇప్పుడు 'ఉస్తాద్ భగత్ సింగ్' మూవీ కోసం మాత్రం ఆమెను పక్కన పెట్టేశారు. ఈ క్రమంలోనే ఈ చిత్రంలో హీరోయిన్లుగా మాళవిక మోహనన్, శ్రీలీల చేస్తున్నట్లు ప్రచారం మొదలైంది. అయితే, తాజాగా ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ఆమెకు వెల్‌కం చెబుతూ తీసుకున్న ఫొటోను కూడా షేర్ చేసింది. మరి మాళవిక ఇందులో నటిస్తుందో లేదో మాత్రం వెల్లడించలేదు.
క్రేజీ కాంబోలో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, రవిశంకర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దీనికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇది 'తేరీ' మూవీకి రీమేక్‌గా రాబోతుంది. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ కూడా ప్రారంభం అయిన విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











