Pushpa 2 : 'కిస్సిక్' రెమ్యునరేషన్ .. అన్ని కాంట్రవర్సీలకు ఇచ్చిపడేసిన శ్రీలీల
భారతీయ చిత్ర పరిశ్రమలో స్పెషల్ సాంగ్స్ కి ఒక సెపరేట్ లీగ్ ఉంటుంది అని చెప్పాలి. పలు సినిమాలకి హైప్ ని ఇచ్చేది కూడా దాదాపు పాటలే అని చెప్పడంలో కూడా ఎలాంటి సందేహం లేదు. ఇపుడు వస్తున్న పలు భారీ చిత్రాల్లో దాదాపు ఐటెం సాంగ్ లేకుండా ఆ మూవీ పూర్తి కావడం లేదు. అలా ఇపుడు మొత్తం పాన్ ఇండియా ఆడియెన్స్ ఓ రేంజ్ లో ఎదురు చూస్తున్న సినిమా ఏదన్నా ఉంది అంటే అది ఖచ్చితంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సెన్సేషనల్ సీక్వెల్ చిత్రం పుష్ప 2 అని చెప్పొచ్చు.
దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమా కోసం టాలీవుడ్‌తో పాటు యావత్ భారతదేశం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. అల్లు అర్జున్, సుకుమార్, దేవిశ్రీ ప్రసాద్ కాంబినేషన్ అంటే అదిరిపోయే సాంగ్స్‌కి పెట్టింది పేరు. ఇక సుకుమార్ అంటే ఐటెం సాంగ్స్ స్పెషలిస్ట్ . ఓ రకంగా అల్లు అర్జున్ ని పాన్ ఇండియా ఆడియెన్స్ కి రీచ్ అయ్యేలా చేసింది ఈ పాటలే అని చెప్పాలి. ఇలా పుష్ప 1 లో ఊ అంటావా సాంగ్ పాన్ ఇండియా సినిమాని షేక్ చేస్తే ఇపుడు పార్ట్ 2 కి కిస్సిక్ అనే సాంగ్ భారీ హైప్ క్రియేట్ చేస్తోంది.

ఈ సాంగ్ లో టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీలీల మెరిసింది. కిస్సిక్ సాంగ్ కోసం శ్రీలీల కంటే ముందు చాలా మంది హిందీ హీరోయిన్స్ పేర్లు తెరపైకి వచ్చాయి. కానీ ఫైనల్ గా మేకర్స్ మాత్రం శ్రీలీల దగ్గర ఆగారు. బాలీవుడ్ బ్యూటీలను కూడా పక్కనపెట్టి శ్రీలీలనే ఈ ఆఫర్ వరించడం వెనుక రీజన్ ఏంటని సినీ వర్గాలు చర్చించుకున్నాయి. ఇందులో తేలింది ఏంటంటే ఆమె చాలా తక్కువ రెమ్యునరేషన్ తీసుకోవడమేనట. బాలీవుడ్ స్టార్ హీరోయిన్లు జాన్వీ కపూర్, శ్రద్దా కపూర్ లు 3 కోట్లు, 4 కోట్లు అడిగితే శ్రీలీలా మాత్రం కేవలం 1 కోటికే ఐటెం సాంగ్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందని సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
పైగా శ్రీలీల ఇన్నేళ్ల కెరీర్ లో మొదటిసారి ఐటెం సాంగ్ ని కూడా ఒప్పుకోవడం అది కూడా అల్లు అర్జున్ వంటి స్టార్ హీరో పక్కన కావడంతో సినిమాకు బూస్ట్ వచ్చింది. ఇపుడు ఈ రెండు అంశాలపై కూడా శ్రీలీల క్లారిటీ ఇచ్చింది. శ్రీలీల ఈ సాంగ్ కోసం ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా రెమ్యునరేషన్ తీసుకోలేదట. ప్రస్తుతానికి జీరో రెమ్యునరేషన్ తోనే సాంగ్ ని చేసింది అని తేలిపోయింది. ఇక దీనితో పాటుగా అసలు ఐటెం సాంగ్ ఎందుకు ఓకే చేసిందో కూడా రివీల్ చేసింది.

తనకి చాలా ఐటెం సాంగ్స్ చేయమని ఆఫర్స్ వచ్చాయని.. కానీ అవన్నీ రిజెక్ట్ చేసి పుష్పకి మాత్రమే ఓకే చేశాను అని శ్రీలీల చెప్పింది. ఇదెందుకు అంటే పుష్ప 2 సాంగ్ మాత్రం తనకి మామూలు సాంగ్ లా అనిపించలేదట. అందుకే ఈ సాంగ్‌కి వెంటనే ఓకే చేశాను అని శ్రీలీల చెప్పుకొచ్చింది. ఈ లెక్కన కిస్సిక్ సాంగ్ మాత్రం శ్రీలీలని గట్టిగానే ఎగ్జైట్ చేసింది అని చెప్పాలి. కానీ తనకి మాత్రం సమంతకి వచ్చిన రేంజ్ మార్కులు ఇంకా పడలేదు. మరి చూడాలి ఫుల్ సాంగ్ వచ్చాక ఎలా ఉంటుంది అని అనేది.


Click it and Unblock the Notifications











