యంగ్ హీరోయిన్‌‌తో శ్రీలీల బాయ్‌ఫ్రెండ్ జంప్, అది అడ్డుపెట్టి లిప్‌లాక్‌తో హీరో మజా!

ప్రస్తుతం టాలీవుడ్ టూ బాలీవుడ్‌లలో హాట్ టాపిక్‌గా మారారు యంగ్ బ్యూటీ శ్రీలీల. నిండా పాతికేళ్లు కూడా లేని ఈ ముద్దుగుమ్మ ఇటీవల ఓ చిన్న పోస్ట్‌తో కలకలం రేపారు. బిగ్ డే , కమింగ్ సూన్ అంటూ సాంప్రదాయ దుస్తుల్లో కనిపించి షాకిచ్చారు. అసలే గత కొద్దినెలలుగా బాలీవుడ్ స్టార్ హీరో కార్తీక్ ఆర్యన్‌తో ఈమె డేటింగ్‌లో ఉన్నారంటూ వదంతులు వస్తున్న సమయంలో శ్రీలీల లుక్స్, గెటప్ అన్ని అనుమానాస్పదంగా కనిపించాయి. సెలైంట్‌గా ప్రియుడిని పెళ్లాడబోతుందా అంటూ కథనాలు వచ్చాయి.

టాలీవుడ్‌లో శ్రీలీల హవా

ప్రస్తుతం టాలీవుడ్‌లో రైజింగ్‌లో ఉన్నది ఎవరంటే ఖచ్చితంగా శ్రీలీలే అని అంటారు. యంగ్ హీరోలకు ఫేవరేట్ హీరోయిన్‌గా పర్ఫెక్ట్ సెట్ కావడంతో పాటు డ్యాన్స్‌లు, అందంతో శ్రీలీల డిమాండ్ పెరిగి పోయింది. ఆమె ఎంత అడిగితే అంత రెమ్యునరేషన్ ఇచ్చేందుకు దర్శక నిర్మాతలు శ్రీలీల ఇంటి ముందు క్యూ కడుతున్నారు. టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్ నుంచి కూడా ఆఫర్లు వెల్లువెత్తుతుండటంతో ఆమె డైరీ అస్సలు ఖాళీ లేదు.

Sreeleela Rumoured Boyfriend Kartik Aaryan Liplock With Ananya Pandey for Tu Meri Main Tera Main Tera Tu Meri

బాలీవుడ్‌పై ఫోకస్ పెట్టిన శ్రీలీల

తెలుగులో ఇక తనను కదిలించేవారు లేరని ఫిక్స్ అయిన శ్రీలీల బాలీవుడ్‌పై ఫోకస్ పెట్టింది. కార్తీక్ ఆర్యన్ సరసన అనురాగ్ బసు దర్శకత్వంలో ఆషికి 3 అనే సినిమా చేస్తోంది. ఇది కాకుండా మరో స్టార్ హీరో సిద్ధార్ధ్ మల్హోత్రా పక్కన మరో సినిమాలో ఛాన్స్ వచ్చినట్లుగా గాసిప్స్ వినిపిస్తున్నాయి. చిన్న వయసు కావడం, పైగా డ్యాన్స్‌ల్లో తిరుగు లేకపోవడంతో రాబోయే రోజుల్లో బాలీవుడ్‌లో యంగ్ హీరోయిన్స్‌, స్టార్ కిడ్స్‌కి పోటీ వస్తుందని బీటౌన్ మీడియా హెచ్చరిస్తోంది. ప్రస్తుతం తెలుగులో జూనియర్, మాస్ జాతర, లెనిన్, తమిళంలో పరాశక్తి సినిమాలలో శ్రీలీల నటిస్తున్నారు.

కార్తీక్ ఆర్యన్‌తో శ్రీలీల డేటింగ్?

బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిందో లేదో ముంబై నీళ్లు బాగా పడ్డాయంటున్నారు విమర్శకులు. వచ్చి రావడంతోనే కార్తీక్ ఆర్యన్‌తో ప్రేమలో పడిందని, వీరి పెళ్లికి హీరో తల్లి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని త్వరలోనే పెళ్లి జరగబోతోందని మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. కట్ చేస్తే శ్రీలీల మెడ కింద పసుపుతో, ముత్తయిదువుల ఆశీర్వాదాలు, గంపలో పెళ్లికూతురిలాగా తనను తీసుకెళ్తున్న ఫోటోలను షేర్ చేసి షాకిచ్చారు. అవి చూడగానే ఖచ్చితంగా శ్రీలీల నిశ్చితార్ధమో, పెళ్లి చేసుకోబోతోందని గాసిప్స్ వైరల్ అయ్యాయి. అయితే తీరిగ్గా అసలు సంగతి చెప్పి షాకిచ్చారు ఈ ముద్దుగుమ్మ. జూన్ 14న తన పుట్టినరోజు సందర్భంగా తమ ఇంట్లో ప్రీ బర్త్ డే సెలబ్రేషన్స్ జరిగాయని వెల్లడించింది. పుట్టినరోజు ఇలా కూడా చేసుకుంటారా? అయినా ప్రీ బర్త్ డే సెలబ్రేషన్స్ కూడా ఉంటాయా? అని నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు.

అనన్య పాండేకు కార్తీక్ లిప్‌లాక్

ఇంతలో శ్రీలీల బాయ్‌ఫ్రెండ్‌గా ప్రచారంలో ఉన్న కార్తీక్ ఆర్యన్ మరో బాంబు పేల్చాడు. హీరోయిన్ అనన్య పాండేతో కలిసి భారత పాస్‌పోర్ట్ పట్టుకుని దాని చాటున ఆమెకు ఘాటుగా లిప్‌లాక్ ఇచ్చి ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ కలిసి జర్నీ చేయబోతున్నామని క్యాప్షన్ పెట్టాడు. ఇది చూసిన నెటిజన్లు శ్రీలీలకు అన్యాయం చేస్తున్నావా? ఆమె పరిస్ధితి ఏంటీ? అని ప్రశ్నిస్తున్నారు. అయితే ఇది కార్తీక్ ఆర్యన్ కొత్త సినిమా కోసం చేసిన ఫోటో షూట్. సమీర్ విద్వాన్ దర్శకత్వంలో తు మేరీ మై తేరా, మై తేరా తు మేరీ సినిమాలో అనన్య పాండే- కార్తీక్‌లు కలిసి నటిస్తున్నారు. ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కరణ్ జోహార్, అదార్ పూనావాలా తదితరులు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని 2026 ఫిబ్రవరి 13న ఈ సినిమా రిలీజ్ కానుందని కార్తీక్ ఆర్యన్ తెలిపారు. సో.. అదన్న మాట మేటర్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X