బిగ్ బాస్ హౌస్‌లోకి పదమూడో కంటెస్టెంట్‌గా బుల్లితెర రాములమ్మ

గత రెండు సీజన్లు సాఫీగా సాగిన బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ మూడో సీజన్ విషయంలో మాత్రం వివాదాల్లో ఇరుక్కుంది. షో ప్రారంభానికి ముందే ఈ షో బ్యాన్ చేయాలంటూ పలు అవాంతరాలు ఎదురయ్యాయి. శ్వేతా రెడ్డి, గాయత్రీ గుప్తా లాంటి వారి ఆరోపణలు, ఓయూ జెఏసి నిరసనలు వెల్లువెత్తాయి. అయినప్పటికీ వాటన్నింటినీ అధిగమించి బిగ్ బాస్ షో అట్టహాసంగా ప్రారంభమైంది.

100 రోజుల పాటి నిర్విరామంగా జరగనున్న ఈ షోకి హోస్ట్ గా నాగార్జున వ్యవహరిస్తున్నాడు. ముందుగా బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన ఆయన పార్టిసిపెంట్స్ ఒక్కొక్కరినీ బిగ్ బాస్ హౌస్ లోకి ఆహ్వానిస్తున్నారు. మొత్తం 15 మంది కంటిస్టెంట్లు పాల్గొననున్న ఈ రియాలిటీ షోలో పదమూడవ కంటిస్టెంట్‌గా శ్రీముఖి అడుగు పెట్టారు. బిగ్ బాస్ హౌస్‌లోకి సాదరంగా ఆహ్వానించిన నాగార్జున గురించి ప్రేక్షకులకు ఇంట్రో ఇచ్చాడు.

 Sreemukhi Enters Into the Bigg Boss House

ముందునుంచి అనుకున్నట్లుగానే యాంకర్ శ్రీముఖి బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. సూపర్ లుక్ లో శ్రీముఖి ఎంటర్ కావడంతో ప్రేక్షకులు ఖుషీ అయ్యారు. బుల్లితెర యాంకర్‌గా సుపరిచితమైన శ్రీముఖి పటాస్ షో ద్వారా మంచి పాపులారిటీ తెచ్చుకుంది. ఇటీవలే ఈ షోకి తాత్కాలిక విరామం ప్రకటించి బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంటర్ అయింది. శ్రీముఖి చేయనున్న అల్లరి బిగ్ బాస్ హౌస్‌కి సరికొత్త అందం తెస్తుందనటంలో అతిశయోక్తి లేదు. శ్రీముఖి ఎంటర్ కానుందని తెలిసి ఆమె కోసం ఇప్పటికే స్పెషల్ ఆర్మీ కూడా సిద్ధమైంది.

స్టేట్ మీదకు వస్తూనే పలు పాటలకు డ్యాన్స్ చేసింది ఈ బుల్లితెర రాములమ్మ. ఆ తర్వాత నాగార్జునను అడిగి మరీ హగ్ చేసుకుంది. 'పటాస్' సహా ఎన్నో టీవీ షోల ద్వారా ఫేమస్ అయింది. ఈలోగా ఈ రియాలిటీ షోలో అవకాశం రావడంతో ఇటు వచ్చేసింది. నాగ్ ఆమెను లోపలికి పంపించగా, ముందుగా వెళ్లిన కంటెస్టెంట్లు ఆమెను సాదరంగా ఆహ్వానించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X