రొటీన్ లైఫ్ పిచ్చెక్కిపోతోంది.. అందరితో అంటే కష్టం.. శ్రీముఖి సెన్సేషనల్ కామెంట్స్
ఇటీవలే బిగ్ బాస్ జర్నీ సక్సెస్‌ఫుల్‌గా ముగించిన యాంకర్ శ్రీముఖి అభిమానులతో ఓ వీడియో పంచుకుంది. ఈ వీడియో ద్వారా అభిమానుల గురించి మాట్లాడుతూ పిచ్చెక్కిపోతోందని చెప్పి షాకిచ్చింది శ్రీముఖి. ఇంతకీ ఈ వీడియోలో శ్రీముఖి ఏమని మాట్లాడింది. వివరాల్లోకి పోతే..

100 రోజుల బిగ్ బాస్ ప్రయాణం.. శ్రీముఖి హంగామా
బిగ్ బాస్ రియాలిటీ షోలో పాల్గొనేందుకు గాను 100 రోజుల పాటు బాహ్య ప్రపంచానికి దూరంగా ఉంది శ్రీముఖి. తన షోస్, యాంకరింగ్ అన్నీ పక్కన బెట్టేసి బిగ్ బాస్ హౌస్‌లో అడుగుపెట్టింది. ఈ సీజన్‌లో శ్రీ ముఖి చేసిన హంగామానే హైలైట్ అని చెప్పుకోవడంలో అతిశయోక్తి లేదు. కానీ చివరకు ఆమె రన్నరప్ గా నిలవడం ఒకింత షాకిచ్చింది.

మొదటి నుంచీ హోప్స్.. చివరి క్షణంలో!
బిగ్ బాస్ షో ఆరంభం నుంచే ఈ సారి విజేత శ్రీముఖి అని ఫిక్స్ అయ్యారంతా. ఫైనల్ కి ఒకటి రెండు రోజుల ముందు కూడా శ్రీముఖి టైటిల్ విన్నర్ కాబోతుందని వార్తలు వచ్చాయి. కానీ చివరకు మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా రాహుల్ బిగ్ బాస్ సీజన్ 3 ట్రోఫీ గెలుచుకోవడం ఆమె అభిమానులకు షాకిచ్చింది. కానీ శ్రీముఖి మాత్రం రన్నరప్‌గా తన సంతోషాన్ని వ్యక్తం చేసింది.

రొటీన్ లైఫ్ పిచ్చెక్కిపోతోంది అంటూ
''అందరికీ నమస్కారం.. చివరకు నా రొటీన్ లైఫ్ లోకి వచ్చేశా. నాకు ఓట్ చేసి, నన్ను ఇంత సపోర్ట్ చేస్తున్నారు. చాలా వీడియోస్ చూశాను, పిచ్చెక్కిపోతోంది అంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేసింది శ్రీముఖి. నార్మల్ ప్రపంచానికి వచ్చాక, మీ అందరినీ కలవాలని ఉంది.. కానీ అందరినీ కలవడం కొంచెం కష్టం కావొచ్చు'' అని వీడియోలో పేర్కొంది శ్రీముఖి.

ముద్దు పెట్టేసిన రాములమ్మ
ఇక నుంచి అందరికీ ఈ రాములమ్మ థాంక్స్ చెబుతూనే ఉంటుంది. లవ్ యూ ఆల్ అంటూ ముద్దు పెట్టేసింది శ్రీముఖి. దీంతో శ్రీముఖికి ఆల్ ది బెస్ట్ చెబుతూ బాహ్య ప్రపంచానికి స్వాగతం చెబుతున్నారు ఆమె అభిమానులు. మరోవైపు బిగ్ బాస్ రన్నరప్‌గా గెలిచిన శ్రీ ముఖి తన కుటుంబంతో కలిసి పార్టీ చేసుకుంది.


Click it and Unblock the Notifications











