అది ‘ఢీ’కి సీక్వెల్ కాదు కానీ.. క్లారిటీ ఇచ్చిన శ్రీనువైట్ల
శ్రీను వైట్ల ఒకప్పుడు హిట్ల మీద హిట్లు ఇచ్చాడు. అదే శ్రీను వైట్ల గత కొన్నేళ్లుగా డిజాస్టర్ల మీద డిజాస్టర్లు ఇస్తున్నారు. వరుసగా ఫ్లాపులతో సతమతమవుతున్న శ్రీను వైట్ల ఈ సారి ఎలాగైన హిట్ కొట్టేయాలనే కసి మీదున్నాడు. అందుకే గతంలో వచ్చిన ఓ హిట్ కాంబోను రిపీట్ చేయాలని ఫిక్స్ అయ్యాడు. మంచు విష్ణు శ్రీను వైట్ల కాంబోలో వచ్చిన ఢీ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే.
ఢీ విడుదలై నేటికి పద్నాలుగేళ్లు అవుతోంది. ఈ క్రమంలో శ్రీను వైట్ల ఎమోషనల్ అయ్యాడు. నాటి విషయాలను గుర్తు చేసుకున్నాడు. శ్రీహరి, జయప్రకాష్ నారాయణ, చక్రిలను తలుచుకుంటూ ఎమోషనల్ అయ్యాడు. ఢీ సినిమా నాకెంతో నేర్పించింది. ప్రతీ రోజూ ఓ చాలెంజ్‌లా గడిచింది. అయినా ఎన్నో అవాంతరాలను దాటి ఢీ సినిమాను మీ ముందుకు తెచ్చాం. మేం పడ్డ కష్టానికి తగిన ప్రతి ఫలం ఇచ్చిన మీ అందరికీ రుణ పడి ఉంటాను.

ఇప్పుడు మేం చేయబోతోన్న డబుల్ డోస్ సినిమా ఢీకి సీక్వెల్ కాదు. కానీ ఓ చిన్న కనెక్షన్ ఉంటుంది. అయితే ఈ సారి మాత్రం అంతకు మించి నవ్వించేందుకు రెడీగా ఉన్నాం.. మీ అందరినీ పొట్ట చెక్కలయ్యేలా నవ్వించేందుకు మేం వచ్చేందుకు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నామంటూ శ్రీను వైట్ల చెప్పుకొచ్చాడు. ఈ మూవీ కోసం మంచు విష్ణు తన శరీరాకృతిని మార్చుకునే పనిలో పడిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











