ఈ మధ్య కాలంలోనే అలాంటి చిత్రం.. సరిలేరుపై దర్శకుల కామెంట్స్
సూపర్ స్టార్ మహేష్ బాబు చిత్రం వస్తుందంటే.. ఆయన ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సెలెబ్రిటీలు సైతం ఎదురుచూస్తుంటారు. ముఖ్యంగా ఆయనతో పని చేసిన దర్శకులు, మిగతా డైరెక్టర్స్ ఫస్ట్ డే చూసేందుకు ఇష్టపడుతుంటారు. ఎన్నో అంచనాల నడుమ నేడు విడుదలైన సరిలేరు నీకెవ్వరు చిత్రంపైనా తెలుగు సినీ దర్శకులు శ్రీనువైట్ల, హరీష్ శంకర్, వివి వినాయక్, బాబీ లాంటి సినిమాకు ఆల్ ది బెస్ట్ చెప్పడమే కాకుండా తమ అభిప్రాయాలను కూడా పంచుకున్నారు.
ఈ మధ్య కాలంలో..
ఈ మధ్య కాలంలో వచ్చిన హాస్య భరిత చిత్రాల్లో ది బెస్ట్ అంటూ శ్రీను వైట్ల ట్వీట్ చేశాడు. ప్రతీ ఫ్రేమ్‌లో మహేష్ అద్భుతంగా ఉన్నాడని, ఆయన్ను చూడటం ఓ ట్రీట్ అని చెప్పుకొచ్చాడు. అనిల్ రావిపూడి తన మార్క్‌ను చూపెట్టాడని, అనిల్ సుంకరకు కంగ్రాట్స్ తెలిపాడు.
హరీష్ శంకర్ ట్వీట్ చేస్తూ.. అందరూ అనుకున్నట్టుగానే సరిలేరు నీకెవ్వరులో మహేష్ అదరగొట్టాడని అన్నాడు. మహేష్‌ను చూడటం కన్నులపండుగే. సరిలేరు పూర్తిగా మాస్ మాసాలాతో కూడుకున్న మహేష్ బాబు చిత్రమని తెలిపాడు. అనిల్ రావిపూడికి, సరిలేరు టీమ్‌కు కంగ్రాట్స్ తెలిపాడు.
గోపిచంద్ మలినేని, డైరెక్టర్ బాబీ, వివి వినాయక్ వంటి వారు.. సరిలేరు చిత్ర బృందానికి, మహేష్ బాబుకు కంగ్రాట్స్ తెలిపారు. సుధీర్ బాబు, సుశాంత్, వరుణ్ తేజ్ వంటి హీరోలు సైతం సరిలేరుపై తమ అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.

అదిరిపోయిన టాక్..
సరిలేరు నీకెవ్వరు చిత్రం నేడు థియేటర్లోకి రాగా.. నిన్న రాత్రి నుంచే ఓవర్సీస్ టాక్ హల్ చల్ చేసింది. సరిలేరు నీకెవ్వరు బ్లాక్ బస్టర్ హిట్ అంటూ ట్విట్టర్‌లో ట్రెండ్ అయిన సంగతి తెలిసిందే. మహేష్ ఫ్యాన్స్ ట్రీట్ ఇచ్చేలా ఉన్న ఈ చిత్రం బాక్సాఫీస్ రికార్డులను కొల్లగొట్టేలానే కనిపిస్తోంది.


Click it and Unblock the Notifications











