తొమ్మిదేళ్ల దూకుడు.. శ్రీనువైట్ల ఎమోషనల్
అటు మహేష్ బాబు కెరీర్‌లో ఇటు శ్రీను వైట్ల కెరీర్‌లో దూకుడు చిత్రానికి ప్రత్యేక స్థానం ఉంటుంది. అప్పటి వరకు ఫ్లాపుల్లో ఉన్న మహేష్ బాబును దూకుడు గట్టెక్కిస్తే.. ఆ మ్యానియాలోంచి బయటపడి ఆ రేంజ్ హిట్టు కొట్టలేక ప్రయాస పడుతున్నాడు శ్రీనువైట్ల. దూకుడు క్రియేట్ చేసిన ప్రభావం అలా ఉంది మరి. ఈ మధ్యే ఈ చిత్రాన్ని బాలీవుడ్‌లో రీమేక్ చేయబోతోన్నారనే వార్త బయటకు వచ్చింది. సినిమా వచ్చి తొమ్మిదేళ్లు అవుతున్నా దాని ప్రభావం ఏ మాత్రం తగ్గలేదు.
మహేష్ బాబు పర్ఫామెన్స్ ఒకెత్తు అయితే.. బ్రహ్మానందం, ఎంఎస్ నారాయణ కామెడీ ట్రాక్స్ సినిమాకు హైలెట్. సినిమా అంతా నవ్వులజల్లు కురవడంతో బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిసింది. మహేష్ బాబు దెబ్బకు బాక్సాఫీస్ అదిరిపోయింది. వంద కోట్ల కలెక్షన్లు కొల్లగొట్టి ఔరా అనిపించింది. నేటికి ఈ చిత్రం విడుదలై తొమ్మదేళ్లు అవుతుండటంతో శ్రీను వైట్ల నాటి సంగతులను గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యాడు.

ఈ మేరకు శ్రీను వైట్ల సెట్స్‌పై దిగిన వర్కింగ్ స్టిల్స్‌ను పోస్ట్ చేస్తూ ఎమోషనల్ అయ్యాడు. సెట్‌లో ఉన్నా లేకపోయినా దూకుడు సినిమా షూటింగ్ సమయం మాత్రం ప్రతీ క్షణం ఎంజాయ్ చేశాం. నా కెరీర్‌లో మైల్ స్టోన్ దూకుడు. ఇలాంటి అద్భుతమైన జర్నీ ఇచ్చినందుకు మహేష్ బాబుకి థ్యాంక్స్. ఇలాంటి గొప్ప మెమోరీ ఇచ్చినందుకు చిత్రానికి పనిచేసిన ప్రతీ ఒక్కరికీ థ్యాంక్స్ అని ఎమోషనల్ అయ్యాడు.


Click it and Unblock the Notifications











