నాటకం బోల్డ్‌గా ఉంది.. ఆర్ ఎక్స్ 100', 'అర్జున్ రెడ్డి'లా..!
రిజ్వాన్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ సమర్పణలో కల్యాణ్ జి .గోగణ దర్శకత్వంలో ఆశిష్ గాంధీ, ఆషిమా హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న చిత్రం 'నాటకం'. శ్రీసాయి దీప్ చాట్ల, రాధిక శ్రీనివాస్, ప్రవీణ్ గాంధీ, ఉమ కూచిపూడి నిర్మాతలు. ఈ సినిమా టీజర్‌ను దర్శకుడు గోపీచంద్ మలినేని, హీరో శ్రీవిష్ణు విడుదల చేశారు. హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో జరిగిన ఈ కార్యక్రమంలో...
హీరో శ్రీవిష్ణు మాట్లాడుతూ ''టీజర్ చాలా బావుంది. బోల్డ్‌గా ఉంది. మా సినిమా బావుంది.. చూడండని ఒకప్పటిలా ప్రేక్షకులకు చెప్పాల్సిన పనిలేదు. సినిమా బావుంటే అందరూ ఆదరిస్తున్నారు. సినిమా అంటే ఇది కదా! అని వేరే ఇండస్ట్రీలు అనుకునే స్థాయికి తెలుగు సినిమా వచ్చింది. ఎంటైర్ యూనిట్‌కు అభినందనలు'' అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ సాయికార్తీక్ మాట్లాడుతూ ''పూర్తి స్థాయి పల్లెటూరి కథ. నాకు కథ నచ్చడంతో అంజిగారిని సినిమాటోగ్రఫీ చేయమని అడిగాను. ఆయన కూడా కథ నచ్చడంతో కెమెరా వర్క్ అందించారు'' అన్నారు.

సినిమాటోగ్రాఫర్ అంజి మాట్లాడుతూ ''కథ వినగానే ఇది చిన్న సినిమా, పెద్ద సినిమా అని నాకు అనిపించలేదు. కంటెంట్ బావుందని అనిపించింది. ఆశిష్‌గాంధీ, ఆషిమా చక్కగా నటించారు'' అన్నారు.
శివ సెల్యూలాయిడ్ సురేశ్ మాట్లాడుతూ ''ఆర్ ఎక్స్ 100' సినిమా తర్వాత చాలా సినిమాలు చూసినా.. ఈ సినిమా కంటెంట్ బాగా నచ్చడంతో సినిమా చేయడానికి ముందుకు వచ్చాం. డైరెక్టర్ కల్యాణ్ సహా ఎంటైర్ టీమ్‌కు అభినందనలు'' అన్నారు.
నిర్మాత రిజ్వాన్ మాట్లాడుతూ ''సినిమా ఇలా ఉంటుంది.. అలా ఉంటుందని ముందే చెప్పను కానీ.. అందరికీ నచ్చే సినిమా అవుతుందని గట్టి నమ్మకం ఉంది. మంచి సినిమా చేశామనే సంతోషం ఉంది'' అన్నారు.


Click it and Unblock the Notifications











