హుషారు ఆడుతుందా అని డౌట్ పడ్డారు.. ఈ రేంజ్ విజయాన్ని ఊహించలేదు.. శ్రీహర్ష
చిన్న చిత్రంగా రిలీజై భారీ విజయాన్ని సొంతం చేసుకొన్న సినిమా హుషారు. ప్రముఖ నిర్మాత బెక్కం వేణుగోపాల్, రియాజ్ నిర్మించిన చిత్రం ద్వారా శ్రీహర్ష కొనుగంటి దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఇటీవల కాలంలో ఎన్నడూలేని విధంగా హుషారు చిత్రం 50 రోజుల పండుగను జరుపుకొన్నది. సంచలన విజయం సాధించడంతో చిత్ర యూనిట్ వేడుకలు జరుపుకొన్నది.
ఈ సందర్భంగా దర్శకుడు శ్రీ హర్ష మాట్లాడుతూ... యూత్‌ను లక్ష్యంగా చేసుకొని ఈ సినిమాను తీశాం. అలాగే మేము అనుకొన్నట్లే ఈ చిత్రం అన్ని వర్గాలను ఆకట్టుకొన్నది. భారీ కలెక్షన్లతోపాటు 50 రోజులు ఆడటం చాలా ఆనందంగా ఉంది అన్నారు.

నిర్మాత బెక్కెం వేణుగోపాల్‌కు కథ చెప్పగానే సినిమా చేయడానికి ఒప్పుకొన్నారు. పరిమితమైన బడ్జెట్ కావడంతో రెగ్యులర్‌గా షూట్ చేయడం కష్టమైంది. నెలకు ఐదురోజులే సినిమా షూట్ చేశాం. ఈ సినిమా ఆడదని కొందరు రిలీజ్‌కు ముందు అన్నారు. కానీ చిత్ర యూనిట్ మంచి నమ్మకం ఉండేది. ముందు నుంచి సినిమా విజయం సాధిస్తుందని నేనూ నమ్మాను. కానీ ఈ స్థాయి విజయం సాధిస్తుందని అనుకోలేదు. త్వరలోనే 50 రోజుల వేడుకను నిర్వహిస్తాం అని శ్రీహర్ష తెలిపారు. అని హర్ష పేర్కొన్నారు.
హుషారు చిత్రం హిందీ, తమిళంలో రీమేక్ అవుతున్నది. దర్శకత్వం వహించమని నన్ను అడిగారు. కానీ మళ్లీ అదే కథను చేయడం ఇష్టం లేక ఒప్పుకోలేదు. మరో సినిమాపై దృష్టిపెట్టాను అని శ్రీహర్ష వెల్లడించారు.


Click it and Unblock the Notifications











