అభిరామ్‌తో ఫస్ట్‌నైట్ అక్కడే.. ఇక సాక్ష్యాలు ఉండవు? శ్రీరెడ్డి సెన్సేషనల్ పోస్ట్
టాలీవుడ్‌లో మీటూ ఆరోపణలు చేసి ప్రకంపనలు సృష్టించింది శ్రీ రెడ్డి. ప్రముఖ నిర్మాత సురేష్ బాబు చిన్న కుమారుడు, రానా సోదరుడు అభిరామ్‌పై ఆరోపణలు చేయడం, మోసం చేశాడని మీడియా ముఖంగా చెప్పడం అందరికీ తెలిసిందే. టాలీవుడ్‌లో ఆడవారిపై జరుగుతున్న ఘోరాలపై, మోసాలపై ఉద్యమం చేస్తానని, స్త్రీ శక్తినంటూ అప్పట్లో తెగ హల్ చల్ చేసింది. ప్రస్తుతం చెన్నై చెక్కేసి చిన్నా చితకా సినిమాలు చేసుకుంటూ ఉంటోంది.

మళ్లీ వార్తల్లోకి..
సమయం సందర్భం లాంటివి లేకపోయినా పవన్ కళ్యాణ్‌పై కామెంట్స్ చేయడం, పవన్ ఫ్యాన్స్ శ్రీరెడ్డి మధ్య మాటల యుద్దం జరగడం లాంటివి చూస్తూనే ఉంటాం. అయితే గత కొన్ని రోజులుగా వీటన్నంటికి దూరంగా ఉంటూ.. వంటల ప్రోగ్రామ్స్, వీడియోలు చేసుకుంటూ యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసుకుంటోంది. తాజాగా మళ్లీ తన విశ్వరూపాన్ని చూపెడుతూ.. బూతుపురాణం మొదలెట్టింది.

రాకేష్ మాష్టర్, కరాటే కళ్యాణిపై ఫైర్..
తన పనేదో తాను చేసుకుంటూ ఉంటే.. ఎందుకు కామెంట్స్ చేస్తారంటూ శ్రీ రెడ్డి రెచ్చిపోయింది. తనను ఇష్టమొచ్చినట్టు కామెంట్ చేసిన రాకేష్ మాష్టర్‌ను పరుషమైన మాటలతో, అసభ్య పదజాలంతో దూషించింది. పనిలో పనిగా కరాటే కళ్యాణ్, పవన్ కళ్యాణ్, మెగా ఫ్యామిలీపైనా నోరు పారేసుకుంది.

అభిరామ్‌తో చెట్టాపట్టాల్..
నిర్మాత సురేష్ బాబు కుమారుడు అభిరామ్‌తో ప్రేమాయణం కొనసాగించానని బహిరంగంగా శ్రీరెడ్డి చెప్పిన సంగతి తెలిసిందే. ఆఫర్స్ ఇప్పిస్తానని తనను మోసం చేశాడని ఆరోపించిన విషయం తెలిసిందే. అయితే వీటిపై అభిరామ్ ఎటువంటి వివరణ ఇవ్వలేదు.
Recommended Video


ఆ భవంతి ఇక ఉండదు..
తాజాగా శ్రీ రెడ్డి చేసిన ఓ పోస్ట్ తెగ వైరల్ అవుతోంది. రామానాయుడు స్టూడియోలో అభిరామ్‌తో తన మొదటి రాత్రి జరిగిన చోటు త్వరలోనే మాయం కాబోతోందని పోస్ట్ చేసింది. అయితే నానక్‌రామ్ గూడలోని రామానాయుడు స్టూడియోను ఓ ప్రైవేట్ వెంచర్స్‌కు అప్పగించారని, త్వరలోనే అక్కడ ఓ రియల్ ఎస్టేట్ వెంచర్ ప్రారంభం కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. బహుషా శ్రీ రెడ్డి దాని గురించే మాట్లాడి ఉంటుంది. అయితే ఈ పోస్ట్‌కు లెక్కలేనన్ని ఫన్నీ కామెంట్స్ వస్తున్నాయి. ఫస్ట్ నైట్‌లో డామినేషన్ ఎవరిది అంటూ కొందరు.. ఇంకెవరు శ్రీ రెడ్డిదే అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











