RGV కోసం ఆ సినిమాను రిజెక్ట్ చేసిన శ్రీ రెడ్డి.. ఎందుకంటే ప్రేమంట!
ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ పవర్ స్టార్ సినిమాతో ఏ రేంజ్ లో రచ్చ చేస్తున్నాడో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. గతంలో ఎప్పుడు లేని విదంగా ఓటీటీ బిజినెస్ కోసం అభిమానులను ఊహించని విదంగా రెచ్చగొడుతున్న విషయం తెలిసిందే. ఇక మరోవైపు ఆయనకు కౌంటర్ ఇచ్చే విధంగా నూతన్ నాయుడు పరాన్నజీవి అనే సినిమాను రూపొందిస్తున్నారు. ఇప్పటికే ఆ సినిమా ఫస్ట్ లుక్, సాంగ్ కూడా రిలీజ్ అయ్యాయి.

పవర్ స్టార్ ఫ్యాన్స్ vs RGV
పవర్ స్టార్ ఫ్యాన్స్ vs రామ్ గోపాల్ వర్మ అన్నట్లుగా ఇంటర్నెట్ వరల్డ్ లో ఒక మినీ యుద్ధమే జరుగుతోంది. ఇక వర్మ పవర్ స్టార్ సినిమాలో నటీనటులను పరిచయం చేసిన RGV ఓ వర్గం వారిని బాగానే ఎట్రాక్ట్ చేశాడు. కానీ నూతన్ నాయుడు పరాన్న జీవి యాక్టర్స్ గురించి ఇంతవరకు క్లారిటీ ఇవ్వలేదు. కానీ రెండు సినిమాలు ఒకేరోజు రిలీజ్ కాబోతున్నాయి.

శ్రీ రెడ్డి ఎక్కడ..?
అసలు మ్యాటర్ లోకి వస్తే.. ఈ వివాదంలో శ్రీ రెడ్డి ఎక్కడా కనిపించడం లేదని అనుకుంటున్న తరుణంలో ఆమె ఊహించని విదంగా స్పందించారు. అసలైతే పరాన్నజీవి సినిమా కోసం ఆమెను సంప్రదించారట. అందులో ఆమె నటిస్తోందనే రూమర్స్ కూడా వచ్చాయి. పవన్ కళ్యాణ్ పై ఎక్కువగా నెగిటివ్ కామెంట్స్ చేసే ఈ వివాదల సుందరి అందులో ఎందుకు నటిస్తోంది అనే అనుమానాలు చాలానే వచ్చాయి.

RGV కోసం రిజెక్ట్..
కానీ అందుకు శ్రీ రెడ్డి ఒప్పుకోలేదట ఇటీవల ఆ విషయంపై ఓ మీడియాకు క్లారిటీ ఇచ్చింది. పరాన్నజీవి దర్శకుడు నూతన్ నాయుడు ఒక పాత్ర కోసం ఆమెను సంప్రదించగా ఆమె తిరస్కరించినట్లు తెలిపిందట. ఆ విషయంపై వివరణ ఇస్తూ.. ఐ లవ్ రామ్ గోపాల్ వర్మ.. నేనెందుకు చేస్తాను' అంటూ శ్రీ రేడ్డి సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది.
Recommended Video

పరాన్న జీవిలో ఆమె పాత్ర
గతంలో చాలా సార్లు శ్రీ రెడ్డి పవన్ కళ్యాణ్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఎలక్షన్స్ కి ముందు RGV ఆమెతో పవన్ కళ్యాణ్ ని తిట్టించిన విషయం అందరికి తెలిసిందే. అందుకే పరాన్న జీవిలో శ్రీ రెడ్డి పాత్రను కూడా చూపించబోతున్నట్లు తెలుస్తోంది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.


Click it and Unblock the Notifications











