అమలాపాల్‌ను టార్గెట్ చేసిన శ్రీ రెడ్డి.. నీ పంజాబీ మొగుడు బాగా అంటూ సెన్సేషనల్ కామెంట్స్

గత కొన్ని రోజులుగా అమలాపాల్ వ్యవహారం వార్తలో నిలుస్తూనే ఉంది. రెండో పెళ్లి చేసుకుందని, వాటికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొట్టాయి. అయితే ఒక్క రోజులోనే విషయం మొత్తం మారిపోయింది. అది తన పెళ్లి ఫోటోలు కాదని, ఓ ఈవెంట్ కోసం చేసిన ఫోటో షూట్ అంటూ వార్తలపై నీళ్లు చల్లేసింది. ఇలా అమలా పాల్ రెండో పెళ్లి వ్యవహారం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది.

Recommended Video

Sri Reddy Comments On Amala Paul About Bhavninder Singh
దర్శకుడితో పెళ్లి, విడాకులు..

దర్శకుడితో పెళ్లి, విడాకులు..

తమిళ దర్శకుడు విజయ్‌తో ప్రేమ వ్యవహారం నడిపింది అమలాపాల్. పెళ్లి చేసుకున్న కొద్ది రోజులకే విడాకుల వరకు చేరుకుంది వారి బంధం. విడిపోయినా ఆ ఇద్దరు మాత్రం స్నేహితులుగానే ఉంటూ వచ్చారు. అందరూ వారిద్దరి విషయాన్ని మరిచిపోతున్న తరుణంలో.. విజయ్ తండ్రి మూలానా మళ్లీ వార్తల్లోకెక్కారు.

ధనుష్ మూలానే విడిపోయారు..

ధనుష్ మూలానే విడిపోయారు..

హీరో ధనుష్ మూలానే అమలా పాల్-విజయ్ విడిపోయారని ఆయన తండ్రి చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి. సినిమాల్లో నటించొద్దని విజయ్ కోరినా.. ధనుష్ అడిగాడని నటించిందని, దాంతో వారిద్దరి మధ్య గొడవలు వచ్చాయని,విడిపోయారని కామెంట్స్ చేశాడు. అయితే అలాంటిదేమీ లేదని అమలాపాల్ కొట్టిపారేసింది.

పెళ్లి ఫోటోలు అంటూ హల్చల్..

పెళ్లి ఫోటోలు అంటూ హల్చల్..

బాలీవుడ్ సింగర్ భవీందర్ సింగ్‌తో అమలా పాల్ డేటింగ్ చేస్తోందని గత కొన్ని రోజులుగా వార్తలు వచ్చాయి. దానికి తగ్గట్టే పెళ్లి ఫోటోలు బయటకు రావడంతో.. అమలాపాల్ సీక్రెట్‌గా రెండో పెళ్లి చేసుకుందనే కామెంట్ చేశారు. అది ఫోటో షూట్ కోసం చేశానని, తాను పెళ్లి చేసుకోలేదని వివరించింది. భవీందర్ సింగ్, అమలాపాల్ విడిపోయారని దగ్గరి సన్నిహితులు కూడా స్పష్టం చేశారు.

టార్గెట్ చేసిన శ్రీ రెడ్డి..

టార్గెట్ చేసిన శ్రీ రెడ్డి..

అన్ని విషయాల్లో తల దూర్చే శ్రీ రెడ్డి.. అమలా పాల్ వ్యవహారంలోనూ ఎంటరైంది. ‘బాధపడకు అమలాపాల్.. నీ పంజాబీ మొగుడు బాగానే చూసుకుంటాడు.. నాకు పంజాబీల గురించి తెలుసు.. నాకు వారిపై నమ్మకం ఉంద'ని పోస్ట్ చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X