మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన శ్రీరెడ్డి.. ఓమ్ భూమ్ ఫట్.. నానిని టార్గెట్ చేస్తూ పోస్ట్
టాలీవుడ్‌లో క్యాస్టింగ్ కౌచ్ అంటూ పెద్ద దుమారం లేపింది శ్రీరెడ్డి. వారు వీరు అని తేడా లేకుండా అందర్నీ ఓ రౌండ్ వేసుకుంది. సినీ పెద్దలపై మీటూ ఆరోపణలు చేసింది. దగ్గుబాటి సురేష్ తనయుడు అభిరామ్ తనను మోసం చేశాడని, వారిద్దరు సన్నిహితంగా ఉన్న ఫోటోలను షేర్ చేసి నానా రచ్చ చేసింది. అయితే అదంతా గతం.. ఇప్పుడు శ్రీరెడ్డి కోలీవుడ్‌కి మకాం మార్చేసింది. అక్కడే అడపాదడపా చిత్రాలను చేస్తూ కాలం వెళ్లదీస్తోంది. రెండు మూడు వారాలుగా శ్రీరెడ్డి మళ్లీ వార్తల్లో నిలుస్తోంది. తాజాగా నానిపై మరోసారి పడింది.
Recommended Video

రాకేష్ మాష్టర్ వ్యవహారం..
రాకేష్ మాష్టర్ తనను డిన్నర్‌కు పిలిచాడని గతంలో ఏదో ఒక ఇంటర్వ్యూలో శ్రీ రెడ్డి చెప్పుకొచ్చింది. అయితే దానిపై రాకేష్ మాష్టర్ తాజాగా స్పందించాడు. ఆ క్రమంలో శ్రీరెడ్డిపై శివాలెత్తాడు. దమ్ముంటే నా ముందుకు వచ్చి మాట్లాడమని అంటూ రెచ్చిపోయాడు. ఇలా మొదలైన గొడవ రెండు వారాల నుంచి ఏదో ఒక రూపంలో కొనసాగుతూనే ఉంది.

ఫిర్యాదుల గోల..
తమను ధూషించారని కరాటే కళ్యాణి, శ్రీరెడ్డి, రాకేష్ మాస్టర్ ఇలా అందరూ ఒకరి మీద ఒకరు ఫిర్యాదుల చేసుకున్నారు. అయితే ఇది వరకు వెళ్తుందో తెలియదు గానీ.. పోలీస్ స్టేషన్ మెట్లెక్కెడంతో వ్యవహారం కాస్త వేడిగా మారింది. ఇదంతా కాసేపు పక్కనపెడితే.. శ్రీ రెడ్డి మళ్లీ పుంజుకుంటోందని తెలుస్తోంది. తాజాగా ఆమె చేసిన పోస్ట్‌లు చూస్తే అది అర్థమవుతుంది.

హిట్టా ఫట్టా..
నాని నిర్మాతగా విశ్వక్‌సేన్ హీరోగా వచ్చిన చిత్రం HIT. ఈ మూవీ నిన్న (ఫిబ్రవరి 28)నే విడుదలైంది. అయితే సినిమాకు విమర్శల ప్రశంసలు దక్కాయి. హిట్ సూపర్ హిట్ దిశగావెళ్లే అవకాశముందని రిపోర్ట్స్ వస్తున్నాయి. ఈ క్రమంలో నిన్న ఉదయం శ్రీరెడ్డి ఈ మూవీపై ఓ పోస్ట్ చేసింది. హిట్టా.. ఫట్టా అంటూ ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టింది.

ఓమ్ భూమ్ ఫట్..
ఆ తరువాత కొంత సమయానికి నూని గాడు ఓమ్ భూమ్ ఫట్ అంటగా అంటూ మరో పోస్ట్ చేసింది. హిట్ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినా శ్రీ రెడ్డి మాత్రం ఇలా నెగెటివ్‌గా కామెంట్ చేసింది. ఆ పై మరో పోస్ట్‌లో డెవిల్ ఈజ్ బ్యాక్ అంటూ పేర్కొంది. ఇదంతా చూస్తుంటే శ్రీ రెడ్డి మళ్లీ ఫామ్‌లోకి వచ్చినట్టు.. ఎవరికో మూడినట్టు కనినిపస్తోంది.


Click it and Unblock the Notifications











