విజయ్ దేవరకొండనూ వదలని శ్రీరెడ్డి.. అదే కావాలంటూ సెన్సేషనల్ కామెంట్స్
టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ ఒకరు.. టాలీవుడ్‌పై ఆరోపణలతో సెన్సేషన్ క్రియేట్ చేసింది ఒకరు. అయితే తాజాగా వీరిద్దరు కలిశారు. అయితే అది ప్రత్యక్షంగా కాదు. క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేసిన టాలీవుడ్ బిగ్ సెలెబ్రిటీస్‌పై ఆరోపణలు చేసిన శ్రీ రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాంటి శ్రీ రెడ్డి సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండపై కామెంట్స్ చేసింది. విజయ్‌ను శ్రీ రెడ్డి ఏమని కామెంట్ చేసింది? ఇంతకి ఆ కథెంటో ఓ సారి చూద్దాం.

ఫేస్ బుక్ పోస్ట్‌లతో హల్చల్..
శ్రీ రెడ్డి ఫేస్ బుక్ వాల్‌ను మామూలు మనుషులెవ్వరూ చూసి తట్టుకోలేరు. అంతటి అసభ్యపదజాలంతో పోస్టింగ్స్ చేస్తూ ఉంటుంది. ఇలా రెచ్చిపోయి చేస్తుంది కాబట్టే ఆమె పోస్ట్‌లు తెగ వైరల్ అవుతుంటాయి. పిచ్చి పిచ్చి ఫోటోలు షేర్ చేస్తూ వల్గర్ క్యాప్షన్స్‌తో రెచ్చిపోతూ ఉంటుంది.

పూరీ ఛార్మీలపై శ్రీరెడ్డి..
టాలీవుడ్‌లో ఒక్కొక్కరిని టార్గెట్ చేసే శ్రీ రెడ్డి.. ఇప్పటికే నాని, అభిరామ్, పవన్ కళ్యాణ్ వంటివారు ఆ జాబితాలోకి చేరిపోయారు. తాజాగా ఈ లిస్ట్‌లోకి డేరింగ్ అండ్ డాషింగ్ పూరీ జగన్నాథ్, ఛార్మీలపై కామెంట్ చేసింది. చార్మింగ్ పూరీ అంటూ కామెంట్ చేసింది.

కొద్ది సేపటికే అలా..
ఈ పోస్ట్ చేసిన కొద్ది సేపటి మరో సెన్సేషనల్ పోస్ట్ చేసింది. మూవీ స్టార్స్ అన్నం కంటే ఎక్కువగా లిప్‌స్టిక్ తింటారని, ఎవరైతే ఎక్కువగా స్టిక్స్ తింటారో వారికే సినిమా అవకాశాలు ఎక్కువగా వస్తాయని పోస్ట్ చేసింది. అయితే ఇది ఎవరిని ఉద్దేశించి అన్నదో మాత్రం క్లారిటీ రావడం లేదు.

తాజాగా విజయ్‌పై..
టాలీవుడ్ యూత్ ఐకాన్, స్టైలింగ్‌కు మారుపేరుగా నిలిచే విజయ్ దేవరకొండపై శ్రీ రెడ్డి కామెంట్స్ చేసింది. మామూలుగా విజయ్ క్యాస్టూమ్స్ బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్‌ను పోలి ఉంటాయని కామెంట్స్ వినిపిస్తూ ఉంటాయి. అదే విషయాన్ని శ్రీ రెడ్డి ప్రస్థావించింది.
Recommended Video


అదే కావాలి..
విజయ్ దేవరకొండ నువ్వంటే మా అందరికీ చాలా ఇష్టం. రణ్‌వీర్ సింగ్‌ను కాపీ చేయాల్సిన అవసరం లేదు.. జిరాక్స్ నహీ చాహీయే (జిరాక్స్ వద్దు), అస్లీ చాహియే (అసలైంది కావాలి, నిజమైంది కావాలి) అంటూ శ్రీరెడ్డి పోస్ట్ చేసింది.


Click it and Unblock the Notifications











