శ్రీరెడ్డి దొరికిపోయింది.. వైరలవుతోన్న ఫస్ట్ లుక్
ఎస్ఎస్ఆర్ ఆర్యన్, ఉపాసన హీరోహీరోయిన్లుగా రాహుల్ పరమహంస దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కరుతుకలై పతివు సెయ్. తమిళంలో ఘనవిజయం సాధించిన ఈ చిత్రాన్ని తెలుగులో యశ్వంత్ మూవీస్ పతాకంపై శ్రీరెడ్డి దొరికిపోయింది (మానవమృగాలకు అనేది టాగ్‌లైన్) పేరుతో నిర్మాత డి. వెంకటేశ్ విడుదలచేస్తున్నారు. నూతన సంవత్సర శుభాకాంక్షలతో ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదలచేసింది చిత్ర యూనిట్.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత డి. వెంకటేశ్ మాట్లాడుతూ.. తమిళ్‌లో పెద్ద విజయం సాధించిన ఈ చిత్రాన్ని మా బేనర్‌లో విడుదల చేయడం సంతోషంగా ఉందన్నాడు. ప్రస్తుతం సమాజంలో ఆడవారిపై జరుగుతున్న హత్యాచారాల నేపథ్యంలో సినిమా ఉంటుందని పేర్కొన్నాడు. వాటికి గల కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రతలు ఈ మూవీలో చూపించడం జరిగిందని వెల్లడించాడు.

మన నేటివిటికి తగ్గట్లు మాతృకలో కొన్ని మార్పులు చేశామని తెలిపాడు. జీతన్2 లాంటి సస్పెన్స్ థ్రిల్లర్ తెరకెక్కించిన రాహుల్ దర్శకత్వంలో వస్తోన్న మూవీ కావడంతో మంచి అంచనాలు ఏర్పడ్డాయని అన్నాడు. టైటిల్ కి మంచి రెస్పాన్స్ వస్తోందని, అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి త్వరలో విడుదలతేదిని ప్రకటిస్తామని అన్నారు.
ఎస్ఎస్ఆర్ ఆర్యన్, ఉపాసన హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి రాహుల్ పరమహంస దర్శకత్వం వహించగా.. గణేష్ కుమార్ ఎడిటర్‌గా, గణేష్ రాఘవేంద్ర సంగీత దర్శకులుగా, మనోహర్ సినిమాటోగ్రఫర్‌గా వ్యవహరిస్తున్నారు.


Click it and Unblock the Notifications











