Just In
Don't Miss!
- News
చంద్రబాబు చచ్చిన పాముతో సమానం..ఎక్కడికెళ్ళినా పీకేదేం లేదు: విజయసాయి రెడ్డి ధ్వజం
- Finance
అయిదేళ్లలో 63% పెరగనున్న కుబేరులు, ప్రపంచంలోనే భారత్ టాప్
- Sports
ఇంగ్లండ్ ఓటమిని ఎగతాళి చేసిన ఆ దేశ మహిళా క్రికెటర్.. మండిపడ్డ పురుష క్రికెటర్లు!
- Automobiles
525 హార్స్ పవర్ వి8 ఇంజన్‌తో వస్తున్న మోస్ట్ పవర్ఫుల్ డిఫెండర్ వి8
- Lifestyle
marriage life: పెద్దలు కుదిర్చిన పెళ్లితో లాభమా.. నష్టమా?
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఆ విషయాలు లేవనెత్తిన శ్రీ రెడ్డి.. అంతా తనకు తెలుసంటూ పవన్ కళ్యాణ్‌పై ఫైర్
సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ శ్రీరెడ్డి.. ఆమె మాట్లాడితే అదో వార్త అవుతుంది. అయితే ఆ మాటలను మాత్రం యథాతథంగా రాయడానికి మాత్రం వీలుండదు. అంతటి పరుష పదజాలంతో రెచ్చిపోతూ ఉంటుంది. ఆ మధ్య మీటూ ఉద్యమాన్ని ఉవ్వెత్తున నడిపించి.. సైలెంట్‌గా కోలీవుడ్‌లో సెటిలైపోయింది. వంటలకు సంబంధించిన వీడియోలు చేసుకుంటూ చడీ చప్పుడు లేకుండా ఉంది.

మళ్లీ రెచ్చిపోయిన శ్రీరెడ్డి..
అడపాదడపా ఫేస్‌బుక్‌లో కామెంట్స్ పెడుతూ ఉండే శ్రీ రెడ్డి లైవ్‌లోకి రావడం మానేసింది. రాకేష్ మాష్టర్ చేసిన కామెంట్స్‌పై ఫైర్ అవుతూ.. తన విశ్వరూపాన్ని చూపించింది. రాకేష్ మాష్టర్‌ను తిడుతూ మధ్యలో కరాటే కళ్యాణి, చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఇలా అందర్నీ టార్గెట్ చేసింది.

కరాటే కళ్యాణిపై పచ్చి బూతులు..
ప్రముఖ నటి కరాటే కళ్యాణిని శ్రీ రెడ్డి ఇష్టమొచ్చినట్టుగా దూషించింది. రాయలేని పదజాలంతో విరుచుకుపడింది. ఎంత మందితో పడుకున్నావో? ఎన్ని పెళ్లిళ్లు చేసుకున్నావో తెలుసంటూ రెచ్చిపోయింది. తనకు బాధ కలిగించిన వారి గురించి మాట్లాడే హక్కు తనకుందని, మీరంతా తననెందుకు టార్గెట్ చేస్తున్నారంటూ మండిపడింది.

పవన్ కళ్యాణ్‌ను టార్గెట్..
పవన్ కళ్యాణ్‌ను అలా తిట్టడం కరెక్ట్ కాదని రాకేష్ మాష్టర్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడంతో.. శ్రీ రెడ్డి మరోసారి పవర్ స్టార్‌పై విరుచుకుపడింది. వాడు సీఎం కాలేడు.. ఏం పీకలేడు అంటూ తీవ్రమైన పదజాలంతో బూతు పురాణం మొదలు పెట్టింది.

ట్యాక్స్‌లు కట్టు..
పవన్ కళ్యాణ్‌కు ఆస్తులు లేవని అందరూ అనుకుంటారు.. అది నిజం కాదని.. ఎంత ఆస్తి ఉందో తనకు తెలుసునని శ్రీ రెడ్డి చెప్పుకొచ్చింది. ట్యాక్స్‌లు కట్టడం లేదని ముందుగా అది కట్టు అని పవన్ కళ్యాణ్‌కు సూచించింది. ఇక మరి ఈ కామెంట్స్ పవన్ ఫ్యాన్స్ ఏమంటారో చూడాలి.