టాలీవుడ్‌లో ఐటీ రైడ్స్.. జగన్, కేసీఆర్‌కు థ్యాంక్స్.. కన్నీరు పెట్టుకున్న శ్రీ రెడ్డి

తెలుగు సినిమా ప్రముఖుల నివాసాలు, కార్యాలయాల్లో బుధవారం ఉదయం ఆదాయపన్ను శాఖ జరిపిన సోదాలు తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. నిర్మాత దగ్గుబాటి సురేశ్‌బాబు ఇళ్లు, కార్యాలయాలతో పాటు రామానాయుడు స్టూడియోలో ఐటీ సోదాలు జరిగాయి. అలాగే ఆయన సోదరుడు ప్రముఖ హీరో 'విక్టరీ' వెంకటేశ్‌ నివాసంలోనూ తనిఖీలు చేశారు. అక్కినేని నాగార్జునకు సంబంధించిన అన్నపూర్ణ స్టూడియోస్‌, ఎంసీహెచ్‌ఆర్‌డీ సమీపంలోని హీరో నాని కార్యాలయాల్లోనూ ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు చేశారు.

సీన్‌లోకి ఎంటరైన శ్రీ రెడ్డి

సీన్‌లోకి ఎంటరైన శ్రీ రెడ్డి

టాలీవుడ్ లో జరిగిన ఐటీ దాడులపై శ్రీరెడ్డి ఆనందం వ్యక్తం చేసింది. మరీ ముఖ్యంగా సురేష్ బాబు, నానికి సంబంధించిన ఇళ్లు, ఆఫీసులపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించడంతో ఆనంద భాష్పాలు రాల్చింది. ఈ రోజు కోసం ఎన్నాళ్ల నుంచో వెయిట్ చేస్తున్నానని తెలిపింది. శ్రీరెడ్డి ఇంత ఆనందపడ్డానికి కారణం అందరికీ తెలిసిందే.

క్యాస్టింగ్ కౌచ్ అంటూ ఆరోపణలు..

క్యాస్టింగ్ కౌచ్ అంటూ ఆరోపణలు..

సురేష్ బాబు చిన్నకొడుకు తనను మోసం చేశాడని గతంలో ఆరోపించింది శ్రీరెడ్డి. నిజానికి ఈ కాస్టింగ్ కౌచ్ వ్యవహారంతోనే ఆమె పాపులర్ అయింది. దీనికి సంబంధించి అభితో శ్రీరెడ్డి క్లోజ్ గా ఉన్న ఫొటోలు కూడా బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఈ వ్యవహారంతో శ్రీ రెడ్డి పేరు రెండు తెలుగు రాష్ట్రాల్లో మార్మోగిపోయింది.

నానిని వ్యక్తిగతంగా టార్గెట్..

నానిని వ్యక్తిగతంగా టార్గెట్..

కాస్టింగ్ కౌచ్ , మీటూ ఉద్యమం అంటూ చాలా హంగామా చేసిన శ్రీరెడ్డి.. చాలామంది నటులపై ఆరోపణలు చేసింది. ఈ క్రమంలో అప్పట్లో నానిపై కూడా తీవ్ర విమర్శలు చేసింది. నానిని ఓ స్త్రీలోలుడు అంటూ ఆరోపించింది. నాని కామానికి బలైపోయిన అమ్మాయిలు తనకు తెలుసంటూ కామెంట్స్ చేసింది. నాని గురించి పచ్చి పచ్చిగా మాట్లాడేసింది. దీంతో నాని పరుపు నష్టం దావా వేసిన సంగతి తెలిసిందే.

తాజాగా నాగ్‌పై కూడా సెటైర్లు..

తాజాగా నాగ్‌పై కూడా సెటైర్లు..

బిగ్‌బాస్ ఫినాల్ స్టేజ్‌పై తమన్నా సింహాద్రిని ఉద్దేశించి మాట్లాడిని చిరంజీవి.. పరోక్షంగా శ్రీ రెడ్డి టాపిక్ తీయడంతో మరోసారి రెచ్చిపోయింది. చిరంజీవి, మెగా ఫ్యామిలీలను టార్గెట్ చేసింది. అలా స్టేజ్‌పై చిరు మాట్లాడుతూ ఉంటే.. నాగార్జున కూడా పక్కనే ఉండి నవ్వాడని, నాగ్‌ను కూడా టార్గెట్ చేయడం మొదలు పెట్టింది.

 వారందరిపై ఐటీ రైడ్స్..

వారందరిపై ఐటీ రైడ్స్..

కట్ చేస్తే, ఇప్పుడు నాని, సురేష్ బాబు, నాగ్‌పై ఐటీ దాడులు జరిగాయి. ఇక ఈ విషయం తెలుసుకున్న శ్రీరెడ్డి పొంగిపోయింది. దేవుడు ఉన్నాడని, తనకు అన్యాయం చేసిన వాళ్లు ఎప్పటికైనా శిక్ష అనుభవిస్తారనడానికి తాజా ఐటీ దాడులే ఉదాహరణ అని చెప్పుకొచ్చింది. నాని తనకు చేసిన అన్యాయానికి శిక్ష అనుభవిస్తున్నాడని, తనకు గతంలో వారు చేసిన అన్యాయాలను గుర్తు చేసుకుని కన్నీరు పెట్టుకుంది.

Recommended Video

#CineBox : RRR Update : Olivia Morris Pairup With Jr. NTR In RRR Movie !
జగన్, కేసీఆర్, మోదీలకు థ్యాంక్స్..

జగన్, కేసీఆర్, మోదీలకు థ్యాంక్స్..

నాని తనపై పరుపు నష్టం కేసు వేశాడని, సురేష్ బాబు కూడా వేశాడని గతంలో జరిగిన సంఘటలను గుర్తు చేసుకుంది. ఐటీ రైడ్స్ చేయిస్తున్న వారందరికీ థ్యాంక్స్ అంటూ జగన్, కేసీఆర్, మోదీలకు ధన్యవాదాలను తెలిపింది. తనను తెలుగు ప్రజలు అర్థం చేసుకోకున్నా.. తమిళ ప్రజలు తనను అంగీకరించారని చెప్పుకొచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X