పోలీస్ స్టేషన్‌లో శ్రీ రెడ్డి.. పెట్రోల్ పోసి తగలబెడతా అంటూ!! మరో సంచలనం

సంచలన తార శ్రీ రెడ్డి.. మరో సెన్సేషన్ క్రియేట్ చేస్తూ వార్తల్లో నిలిచింది. ఈ సారి ఏకంగా పోలీస్ స్టేషన్‌లో ప్రత్యక్షమై తన గోడు వెలిబుచ్చింది. తనను హత్య చేస్తానంటూ బెదిరింపులు కాల్స్ వస్తున్నాయని చెప్పింది. మరి ఇంతకీ శ్రీ రెడ్డిని అంతలా ఎవరు బెదిరిస్తున్నారు? అసలు కథేంటి? వివరాల్లోకి పోతే..

కాస్టింగ్ కౌచ్ ఉద్యమం.. నది రోడ్డుపైనే అలా

కాస్టింగ్ కౌచ్ ఉద్యమం.. నది రోడ్డుపైనే అలా

సినీ ఇండస్ట్రీలో మహిళలను లైంగికంగా లొంగదీసుకుంటూ మోసాలకు పాల్పడుతున్నారని గతంలో శ్రీ రెడ్డి చేసిన హంగామా అంతాఇంతా కాదు. కాస్టింగ్ కౌచ్ ఉద్యమం లేవనెత్తిన ఈమె ఆ తర్వాత టాలీవుడ్ పరిశ్రమకే చుక్కలు చూపించింది. నది రోడ్డుపైనే అర్థ నగ్నంగా నిలబడి తన నిరసన తెలియజేసింది.

మారుమోగిన శ్రీ రెడ్డి పేరు.. అన్నీ అలాంటివే

మారుమోగిన శ్రీ రెడ్డి పేరు.. అన్నీ అలాంటివే

కాస్టింగ్ కౌచ్ ఉద్యమం చేస్తున్న సమయంలో దేశవ్యాప్తంగా శ్రీ రెడ్డి పేరు మారు మోగింది. అలా భారీ పాపులారిటీ సంపాదించిన ఈ బ్యూటీ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతూ మంచి ఫాలోయింగ్ కూడా కూడగట్టుకుంది. అయితే ఆమె సోషల్ మీడియా ఖాతా తెరిస్తే మాత్రం అన్నీ వల్గర్ పోస్టులే కనిపించడం కామన్ అయింది.

శ్రీ రెడ్డిపై పోలీస్ కంప్లైంట్.. వివాదం ముదిరింది

శ్రీ రెడ్డిపై పోలీస్ కంప్లైంట్.. వివాదం ముదిరింది

ఇకపోతే గత కొన్ని రోజులుగా రాకేష్ మాస్టర్- శ్రీ రెడ్డి- కరాటే కళ్యాణి మధ్య నడుమ నడుస్తున్న వివాదం ముదురుతూ వస్తోంది. ఒకరిపై ఒకరు రెచ్చిపోయి కామెంట్స్ చేసుకుంటూ గత పది రోజులుగా రచ్చ రచ్చ చేస్తున్న సంగతి తెలిసిందే. చివరకు ఈ వివాదాన్నని పోలీస్ స్టేషన్‌ వరకు తీసుకుపోయారు రాకేష్ మాస్టర్, కరాటే కళ్యాణిలు. వాళ్లిద్దరూ శ్రీ రెడ్డిపై పోలీస్ కంప్లైంట్ చేశారు.

స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన శ్రీ రెడ్డి

స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన శ్రీ రెడ్డి

దీంతో రాకేష్ మాస్టర్, కరాటే కళ్యాణిలకు సోషల్ మీడియా వేదికగా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది శ్రీ రెడ్డి. తనపై నమోదు చేసిన కేసును వెనక్కితీసుకోవాలని పేర్కొంటూ ఆ ఇద్దరిపై బూతు పదజాలం ఉపయోగిస్తూ వల్గర్ కామెంట్స్ చేసింది. దీంతో ఈ ఇష్యూ మరింత చర్చనీయాంశంగా మారింది.

మరో అడుగు ముందుకు.. పోలీస్ స్టేషన్‌లో

మరో అడుగు ముందుకు.. పోలీస్ స్టేషన్‌లో

ఈ పరిస్థితుల్లో శ్రీరెడ్డి మరో అడుగు ముందుకేసింది. బుధవారం చెన్నై పోలీస్ కమిషనర్ ఆఫీస్‌లో ప్రత్యక్షమై కరాటే కళ్యాణి, డాన్య మాస్టర్ రాజేష్ లపై తన ఫిర్యాదు నమోదు చేసింది శ్రీ రెడ్డి. వాళ్లిద్దరూ తనను హత్య చేస్తానని బెదిరిస్తునట్లుగా ఫిర్యాదులో పేర్కొంది.

ఆడియన్స్ రెస్పాన్స్.. అందుకే అలా

ఆడియన్స్ రెస్పాన్స్.. అందుకే అలా

ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన శ్రీరెడ్డి.. ప్రస్తుతం తనను తమిళ ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, తాను రెండు చిత్రాల్లో కూడా నటిస్తున్నాని చెప్పింది. అందుకే కరాటే కళ్యాణి, డాన్స్ మాస్టర్ రాకేష్ తనపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని తెలిపింది.

ముదిరిన వివాదం.. బెదిరింపులు

ముదిరిన వివాదం.. బెదిరింపులు

తాను చెన్నైలో కొనుకున్న ఇంటికి సంబంధించి ఏదోదో మాట్లాడుతున్నారని, దీనిపై నిలదీస్తే.. పెట్రోలు పోసి తగల పెడతానని హత్యా బెదిరింపులకు పాల్పడుతున్నారని తన ఫిర్యాదులో శ్రీరెడ్డి పేర్కొంది. దీంతో శ్రీ రెడ్డి- రాకేష్ మాస్టర్- కరాటే కళ్యాణి వివాదం మరింత ముదిరింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X