అదే ప్రధాన పెట్టుబడి.. ఆ వీడియోలతో శ్రీ రెడ్డి నయా బిజినెస్
ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ సంచలన తారగా భారీ పాపులారిటీ సంపాదించిన శ్రీ రెడ్డి.. మరో సెన్సేషన్ క్రియేట్ చేస్తూ పలు వీడియోలు పోస్ట్ చేస్తోంది. ఈ వీడియోల ద్వారనే నాలుగు రాళ్లు వెనకేసుకునే ప్రయత్నం చేస్తోంది. ఇంతకీ శ్రీ రెడ్డి చేస్తున్న ప్రయత్నం ఏంటి? ఆ వివరాలు చూద్దామా..

ఈ మధ్యకాలంలో శ్రీ రెడ్డి
ఎప్పుడు ఎవర్ని ఎలా టార్గెట్ చేస్తుందో తెలియని ఈ ఆడ బాంబు ఈ మధ్యకాలంలో సైలెంట్ గా ఉంటోంది. హాయిగా తన పని తాను చేసుకుంటూ ఓ బిజినెస్ స్టార్ట్ చేసి డబ్బు సంపాదిస్తోంది. ఆమెకు ఉన్న భారీ పాపులారిటీ ఆమె చేస్తున్న బిజినెస్ కి ప్లస్ అవుతోంది.

శ్రీ రెడ్డి చాలా కూల్.. ఇక అందులో కూడా
గతంతో పోల్చుకుంటే ఇప్పుడు శ్రీ రెడ్డి చాలా కూల్ అయింది. ఎవరి జోలికి వెళ్లడం లేదు. ముఖ్యంగా కొన్ని రోజుల కింద కొత్త బిజినెస్ మొదలుపెట్టింది శ్రీ రెడ్డి. అందులో భారీగానే సంపాదించుకుంటుంది కూడా. ప్రస్తుతం యూ ట్యూబ్ ఛానెల్ పెట్టుకుని సింపుల్‌గా అందులో వంటలు చేసుకుంటుంది.

వరుస వీడియోలు.. వైరల్
మరో మాట లేకుండా చికెన్, మటన్ వండుకుంటూ తాను తింటూ.. పది మందికి తినిపిస్తుంది శ్రీ రెడ్డి. ఈ వీడియోలు తన స్టైల్లో తీసి యూ ట్యూబ్‌లో పోస్ట్ చేసి దాన్ని బిజినెస్ గా మలచుకుంది. శ్రీ రెడ్డి వీడియోలు కావడంతో అవి కాస్తా బాగా వైరల్ అవుతున్నాయి. ఒక్కో వీడియోకు లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి. తన పాపులారిటీని సరిగ్గా వాడుకుంటూ లేట్ చేయకుండా వరస వంట వీడియోలు పోస్ట్ చేస్తుంది శ్రీ రెడ్డి.

వంటలక్కగా మారిన సంచలన తార
ఏదేమైనా కూడా శ్రీ రెడ్డి ఇలా సైలెంట్ అయిపోవడం మాత్రం జనాలకు షాకిస్తోంది. ఎప్పుడూ ఏదో ఒక సెన్సేషన్ క్రియేట్ చేసే ఆమె ఇలా వంటలక్కగా మారడం కొందరు సరగతిస్తుంటే మరికొందరు వ్యతిరేఖిస్తున్నారు. మరి ఈ సైలెన్స్ వెనక వయలెన్స్ ఏమైనా ఉందా? లేకే నిజంగానే ఆమెలో మార్పు వచ్చిందా అనేది చూడాలి.

రియల్ లైఫ్ క్యారెక్టర్..
ఇక ఇన్నాళ్లు టాలీవుడ్, కోలీవుడ్ సెలెబ్రిటీలపై విరుచుకు పడుతూ బూతు కామెంట్లు పెట్టిన శ్రీ రెడ్డి.. ఏకంగా వెండితెరపై కూడా తన ప్రతాపం చూపించేందుకు రెడీ అవుతోంది. తన రియల్ లైఫ్ క్యారెక్టర్‌కి వెండితెర రూపమివ్వబబోతోంది. ఇటీవలే క్లైమాక్స్ అనే సినిమా సెట్స్‌పై చేరింది శ్రీ రెడ్డి.

శ్రీ రెడ్డి క్లైమాక్స్
క్రైమ్ థ్రిల్లర్ జోనర్‌లో తెరకెక్కుతున్న క్లైమాక్స్ చిత్రంలో డా.రాజేంద్రప్రసాద్, పృథ్వీరాజ్, శివశంకర్ మాస్టర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సాషా సింగ్, రమేష్, చందు పాత్రలు ప్రధానంగా ఉంటాయి. ఇందులో శ్రీ రెడ్డి పాత్రను హైలైట్ చేస్తూ పలు కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు.


Click it and Unblock the Notifications











