bheemla Nayak ట్రైలర్ పై శ్రీరెడ్డి షాకింగ్ రియాక్షన్.. అలా ఉందని అంటూ కామెడీగా..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రానా దగ్గుబాటి కలిసి నటించిన బిగ్గెస్ట్ యాక్షన్ డ్రామా భీమ్లా నాయక్ మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. అయితే సోమవారం విడుదల చేసిన ట్రైలర్ విభిన్నమైన టాక్ ను ఎదుర్కొంటోంది. విడుదలకు ముందే ఈ ట్రైలర్ ఏ స్థాయిలో బజ్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. భారీగా అంచనాలను క్రియేట్ చేసిన ట్రైలర్ విడుదల తర్వాత మాత్రం అంచనాలను అందుకోలేక పోతుంది. ఇక మరొకసారి శ్రీరెడ్డి కూడా ట్రైలర్ పై స్పందించడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

భారీగా ప్రీ రిలీజ్ బిజినెస్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రమే కాకుండా చాలా మంది తెలుగు సినీ ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో భీమ్లా నాయక్ యొక్క టాప్ లిస్టులో ఉంది అనే చెప్పాలి. తప్పకుండా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త సంచలనం క్రియేట్ చేస్తుంది అని సినీ వర్గాలు కూడా చెబుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబందించిన ప్రీ బిజినెస్ భారీగానే జరిగినట్లు ఇండస్ట్రీలో మాట్లాడుకుంటున్నారు. దాదాపు 120కోట్లకు పైగానే బిజినెస్ చేసినట్లు తెలుస్తోంది.

ప్రతీ విషయంలో త్రివిక్రమ్ ఇన్వాల్వ్మెంట్..
సితార ఎంటర్టైన్మెంట్లో నాగ వంశీ నిర్మించిన ఈ సినిమాకు దర్శకుడు సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించాడు. ఇక స్టార్ దర్శకుడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్ అందించగా మాత్రమే కాకుండా సినిమాకు సంబంధించిన అన్ని పనులను కూడా దగ్గరుండి చూసుకున్నాడు. సినిమా స్క్రిప్ట్ మొదలు నుంచి ఫైనల్ మిక్సింగ్ వరకు త్రివిక్రమ్ భీమ్లా నాయక్ ప్రతి విషయంలో ఇన్వాల్వ్ అయినట్లుగా తెలుస్తోంది.

ఈవెంట్ వాయిదా
మొత్తానికి ఈ సినిమాను ఫిబ్రవరి 25వ తేదీన భారీ స్థాయిలో విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సభ్యులు. సోమవారం గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ట్రైలర్ ను విడుదల చేయాలని అనుకున్నారు. కానీ హఠాత్తుగా ఆంధ్రప్రదేశ్ మినిస్టర్ గౌతమ్ రెడ్డి మరణించడంతో పవన్ కళ్యాణ్ ఎలాంటి వేడుకలను జరుపుకోవడం ఇష్టం లేదు అని ఈవెంట్ ను వాయిదా వేసుకోవలసి వచ్చింది.

ట్రైలర్ పై శ్రీరెడ్డి రియాక్షన్
ఇక ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ పై భిన్నమైన టాక్ వైరల్ గా మారింది. ఓ వర్గం అభిమానులకు ట్రైలర్ నచ్చినప్పటికీ చాలా మందికి మాత్రం అనుకున్నంత నచ్చలేదు అని కామెంట్ చేస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ కు సంబంధించిన చాలా విషయాల్లో ఏదో ఒక విధంగా స్పందించి శ్రీరెడ్డి మరొకసారి ట్రైలర్ పై ఎవరూ ఊహించని విధంగా స్పందించింది.

అనుకున్నంత లేదు..
భీమ్లా నాయక్ ట్రైలర్ అనుకున్నంతగా లేదు అంటూ ఈ ట్రైలర్ యావరేజ్ గా ఉంది అని సోషల్ మీడియాలో శ్రీ రెడ్డి ట్వీట్ చేశారు. అంతేకాకుండా బిల్లా నాయక్ ట్రైలర్ అని ట్వీట్ చేసిన శ్రీరెడ్డి పక్కనే నవ్వుతున్న ఎమోజీ లను కూడా పోస్ట్ చేసింది దీంతో ట్వీట్ సోషల్ మీడియాలో మరోసారి వైరల్ అవుతొంది. ఎప్పటి తరహాలోనే అభిమానులకు అలాగే శ్రీరెడ్డి ఫాలోవర్స్ మధ్య కూడా మాటల యుద్ధాలు కొనసాగుతున్నాయి. మరి శ్రీరెడ్డి సినిమా రిలీజ్ తర్వాత ఇంకా ఏ తరహాలో స్పందిస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











