Sri Reddy: అనసూయపై శ్రీ రెడ్డి షాకింగ్ కామెంట్స్.. అందుకే ఆంటీ అన్నానంటూ!
శ్రీరెడ్డి.. తెలుగు సినీ ప్రియులకు అస్సలు పరిచయం చేయనవసరం లేదు. ఎందుకంటే చాలా ఏళ్లుగా ఈ ముద్దుగుమ్మ వివాదాలతో సహవాసం చేస్తూ ఎప్పుడూ ఏదో ఒక గొడవలో భాగం అవుతుంది. దీంతో నిత్యం హాట్ టాపిక్ గా మారుతోంది శ్రీరెడ్డి. దీనికి కారణం సోషల్ మీడియా ద్వారా ఎప్పుడూ ఏదో ఒక పోస్టులు చేస్తూ రచ్చ చేయడమే. తాజాగా యాంకర్ కమ్ ఆర్టిస్ట్ అయినా అనసూయ భరద్వాజ్ పై షాకింగ్ కామెంట్స్ చేసింది. మొదట సానుభూతిగా మాట్లాడిన శ్రీరెడ్డి ఆ వెంటనే సైటెర్లతో పంచ్ లు వేసింది.
నిర్మాతల దృష్టిలో : హీరోయిన్ అవ్వాలన్న లక్ష్యంతో హైదరాబాద్‌లో అడుగు పెట్టిన భామ శ్రీరెడ్డి కెరీర్ స్టార్టింగ్ లో ఓ న్యూస్ ఛానెల్‌లో ప్రజెంటర్‌గా పని చేసింది. తనదైన స్టైల్ లో ప్రజెంటర్ గా పనిచేసిన శ్రీ రెడ్డి చాలా మంది దర్శక నిర్మాతల దృష్టిలో పడింది. ఈ క్రమంలోనే 'నేను నాన్న అబద్ధం' అనే సినిమాలో కీలక పాత్ర పోషించింది. ఆ తర్వాత 'అరవింద్ 2', 'జిందగీ' వంటి సినిమాల్లో నటించింది.

అమ్మాయిల సపోర్ట్ : రెండు మూడు సినిమాల తర్వాత వెండితెరకు దూరమైపోయింది శ్రీరెడ్డి. అప్పుడప్పుడే నటిగా ఎదుగుతోన్న సమయంలోనే శ్రీరెడ్డి కాస్టింగ్ కౌచ్ ఉద్యమాన్ని తెరపైకి తీసుకు వచ్చింది. అవకాశాలు ఇస్తామని చాలా మంది తనను ఇబ్బంది పెట్టారని చెబుతూ శ్రీ రెడ్డి చేసిన ఆరోపణలు సినీ ఇండస్ట్రీలో కలకలం రేపిన విషయం తెలిసిందే. అప్పుడు శ్రీరెడ్డికి చాలా మంది అమ్మాయిలు, మహిళా సంఘాలు మద్దతు కూడా లభించింది.

భిన్న విధాలుగా : టీవీ డిబెట్లు,సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ మాట్లాడటం, సోషల్ మీడియా ద్వారా విపరీతంగా ఫేమస్ అయింది శ్రీరెడ్డి. సినీ సెలబ్రిటీలపైనే కాకుండా రాజకీయ నాయకులపై కూడా తనదైన స్టైల్ లో వ్యాఖ్యలు చేస్తూ ట్రెండ్ అవుతుంటుంది శ్రీరెడ్డి. తాజాగా బ్యూటిఫుల్ అనసూయ భరద్వాజ్ పోస్ట్ చేసిన రెండు వీడియోలపై భిన్న విధాలుగా స్పందించింది శ్రీరెడ్డి.

ఎందుకురా ఏడిపిస్తున్నారు : తాజాగా యాంకర్ అనసూయ పోస్ట్ చేసిన వీడియోలు నెట్టింట్లో తెగ ట్రెండ్ అయిన విషయం తెలిసిందే. మొదటి వీడియోలో ఏడుస్తూ పోస్ట్ చేసింది. దీనికి శ్రీరెడ్డి.. "అరెయ్, ఎందుకురా అనసూయ ఆంటీని ఇలా ఏడిపిస్తున్నారు. పాపం రా.. ఇంతకు తను ఎందుకు ఏడుస్తుందో చాలా మందికి అర్థం కాలేదు. సింపుల్ గా చెప్పాలంటే తను లోపల ఒకటి బయట మరొకటి కాకుండా మనసు ఏం చెబితే అలా తన భావాలను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు" అని రాసుకొచ్చింది.
పాపం బాధిస్తున్నాయి : శ్రీరెడ్డి ఇంకా కొనసాగిస్తూ "అనసూయ చెప్పేది నచ్చని వాళ్లు.. తనకు తప్పుగా కామెంట్స్ చేస్తున్నారు. పాపం అవి తనను బాగా బాధిస్తున్నాయి. నా పోస్ట్ లకు కూడా చాలా మంది దరిద్రమైన కామెంట్స్ పెడుతున్నారు. తప్పురా అలా చేయకూడదు. మంచిగా ఉందాం" అంటూ పోస్ట్ చేసింది. తర్వాత అనసూయ రెండో వీడియో షేర్ చేయగానే మరోలా రియాక్ట్ అయింది శ్రీరెడ్డి.
అబ్బా కమల్ హాసన్ : "A few minutes later, అబ్బా కమల్ హాసన్... ఇలాంటి కథలు పడిద్ది అని నాకు తెలుసు. అందుకే ఆంటీ అన్నది" అని అనసూయ రెండో వీడియోపై సెటైరికల్ గా రాసుకొచ్చింది కాంట్రవర్సీ బ్యూటి శ్రీరెడ్డి. ప్రస్తుతం అనసూయపై శ్రీరెడ్డి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











