శ్రీరెడ్డి మరో అడుగు.. ఇక రచ్చ రచ్చే! స్వయంగా ప్రకటిస్తూ సంచలనం
సంచలన తార శ్రీరెడ్డి మరో అడుగు ముందుకేసింది. ఇన్నాళ్లు సోషల్ మీడియా వేదిక ఫేస్‌బుక్ ద్వారా రెచ్చిపోయి పోస్టులు పెడుతూ పలువురిపై ఆరోపణలు గుప్పించిన ఆమె మరో స్టెప్ తీసుకుంది. ఈ విషయాన్ని స్వయంగా ఆమెనే ప్రకటించింది. ఇంతకీ శ్రీరెడ్డి తీసుకున్న ఆ స్టెప్ ఏంటి? ఎవరికైనా హాని కలిగించే స్టెప్పా? ఆ వివరాలు చూద్దామా..

ఆపేవాడే లేడనట్లుగా శ్రీరెడ్డి హంగామా
కాస్టింగ్ కౌచ్ పేరుతో సినీ ఇండస్ట్రీ పెద్దలు మహిళలను లైంగికంగా దోచుకుంటున్నారంటూ గొప్ప ఉద్యమానికి తెరలేపి నానా హంగామా చేసిన శ్రీ రెడ్డి.. ఆ ఉద్యమాన్ని మధ్యలోనే వదిలేసి చెన్నైకి వెళ్ళింది. ఇక అక్కడి నుంచే సోషల్ మీడియాను వేదికగా చేసుకొని ఆపేవాడే లేడనట్లుగా హంగామా చేస్తోంది.

వల్గారిటీకి కేరాఫ్ అడ్రెస్స్.. శ్రీ రెడ్డి అకౌంట్
సోషల్ మీడియాలో వల్గారిటీకి కేరాఫ్ అడ్రెస్స్ ఏంటయ్యా అంటే అది శ్రీ రెడ్డి అకౌంట్ అంటున్నారు కొందరు. అంతలా ఆ రకమైన పాపులారిటీ తెచ్చుకుంది ఈ సంచలన తార. మొత్తానికైతే ఈ రకంగా అయినా దేశవ్యాప్తంగా శ్రీ రెడ్డి పేరు మారుమోగిపోతోంది. ఇలాంటి పరిస్థితుల్లో మరింత ముందుకెళ్లాలని డిసైడ్ అయినట్లుంది శ్రీ రెడ్డి. అందుకే మరో స్టెప్ తీసుకుంది.

శ్రీ రెడ్డి ఎంటర్.. ఇకపై రచ్చ రచ్చే
ఇన్నాళ్లు తన రచ్చకు ఫేస్‌బుక్ మాత్రమే వేదికగా చేసుకున్న శ్రీ రెడ్డి ఇకపై మరో సోషల్ మీడియా ఖాతా ద్వారా సంచలనం సృష్టించబోతోంది. తాజాగా ఆమె ఇన్స్‌స్టాగ్రామ్ ఖాతా ఓపెన్ చేసింది. ఇక నుంచి తన ఇన్స్‌స్టాగ్రామ్ ఖాతా వేడి పుట్టిస్తా అంటూ ఫేస్‌బుక్ ద్వారా ప్రకటించింది శ్రీ రెడ్డి.
సోషల్ మీడియానే వేడెక్కేలా.. ఫుల్లుగా రెచ్చిపోయిన శ్రీ రెడ్డి
శ్రీ రెడ్డి పెట్టిన ఈ పోస్ట్ చూసి ఆమె ఇన్స్‌స్టాగ్రామ్ ఖాతాకు వెళ్లి చూస్తున్నారు నెటిజన్లు. ఈ ఖాతా చూసి అబ్బో! అని ముక్కున వేలేసుకుంటున్నారు. ఎందుకంటే అందులో శ్రీ రెడ్డి ఫుల్లుగా రెచ్చిపోయి తన హాట్ పిక్స్ షేర్ చేసింది. ఏదేమైనా అలా వచ్చి ఇలా లక్షకు పైగా ఫాలోవర్స్ కూడగట్టింది శ్రీ రెడ్డి. చూడాలి మరి ఇక శ్రీ రెడ్డి ఇన్స్‌స్టా సెన్సేషన్స్ ఎలా ఉంటాయనేది.
Recommended Video

క్లైమాక్స్‌లో శ్రీ రెడ్డి..
ఇక మరికొద్ది రోజుల్లో క్లైమాక్స్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది శ్రీ రెడ్డి.
క్రైమ్ థ్రిల్లర్ జోనర్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో డా.రాజేంద్రప్రసాద్, పృథ్వీరాజ్, శివశంకర్ మాస్టర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది.


Click it and Unblock the Notifications











