twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బక్కచిక్కిన కీర్తి సురేష్‌‌పై శ్రీ రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్

    |

    Recommended Video

    Sri Reddy Sensational Comments On Keerthy Suresh Lean Look || Filmibeat Telugu

    శ్రీ రెడ్డి సంచలనాలు ఏ మాత్రం ఆగటం లేదు. సినీ ఇండస్ట్రీ అంటేనే లైంగిక కార్యకలాపాలకు నిలయం అని చెప్పి సెన్సేషన్ క్రియేట్ చేసిన ఆమె ఎవ్వరినీ వదలడం లేదు. ఇప్పటికే ఎంతో మంది నటీనటులు, దర్శకనిర్మాతలు, హీరోయిన్లు ఆమె సోషల్ మీడియా పోస్టులకు బలై పోయారు. ఆధారాలు చూపకుండా కేవలం సంచలన పోస్టులు పెడుతూ వార్తల్లో నిలుస్తున్న శ్రీ రెడ్డి.. ఈ సారి కీర్తి సురేష్ విషయమై సెన్సేషనల్ కామెంట్స్ చేసింది.

    బక్కచిక్కిన మహానటి

    బక్కచిక్కిన మహానటి

    ఈ మధ్య కాలంలో హీరోయిన్ కీర్తి సురేష్ బాగా సన్నబడింది. ఇన్నాళ్లూ కాస్త బొద్దుగా ఉన్న ఈ భామ ఇప్పుడు నాజూకుగా తయారు కావడంతో ఆమెను ఎవ్వరూ గుర్తు పట్టలేక పోతున్నారు. ఇటీవల ఆమె పోస్ట్ చేసిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడమే గాక ఆమెపై లేనిపోని కామెంట్లను పుట్టించాయి. బ్లూ కలర్‌ స్కర్ట్‌, కళ్లద్దాలతో కనిపిస్తున్న ఆమెను చూసి 'బక్కచిక్కిన మహానటి' అంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు.

    ఇదే అదునుగా శ్రీ రెడ్డి కూడా రంగంలోకి దిగింది

    ఇదే అదునుగా శ్రీ రెడ్డి కూడా రంగంలోకి దిగింది

    ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ జనాల నోళ్ళలో నానడం అంటే శ్రీ రెడ్డికి మహా సరదా. అందుకే ప్రస్తుతం హాట్ టాపిక్ అవుతున్న కీర్తి సురేష్ బక్క చిక్కడం అనే కాన్సెప్ట్ పై కన్నేసింది. ఈ మేరకు తాజాగా సోషల్ మీడియా వేదికగా తనదైన స్టైల్ లో ఓ పోస్ట్ పెడుతూ సెన్సేషనల్ కామెంట్స్ చేసింది శ్రీ రెడ్డి.

    విమానంలో ప్రయాణిస్తుండగా కీర్తి సురేష్

    తాను, కీర్తి సురేష్ ఒకే విమానంలో ప్రయాణిస్తున్నామని.. అయితే ఆ విమానంలో కీర్తి సురేష్ ఉందనే విషయం ఎవ్వరికీ తెలియదని, అసలు ఆమెను ఎవ్వరూ గుర్తు పట్టలేదని పేర్కొంది శ్రీ రెడ్డి. పైగా తనను అందరూ గుర్తు పట్టి తెగ సెల్ఫీలు దిగారని.. బరువు తగ్గి పేషేంట్ లా తయారైన కీర్తిని మాత్రం పట్టించుకోలేదని ఆమె సంచలన కామెంట్స్ చేసింది.

    కావాలనే తగ్గిన మహానటి

    కావాలనే తగ్గిన మహానటి

    బొద్దుగా, ముద్దుగా ఉండే కీర్తి సురేష్ కావాలనే బరువు తగ్గిందని తెలుస్తోంది. తన కొత్త సినిమాలో పాత్ర కోసం జిమ్‌లో కసరత్తులు చేసి మరీ ఇలా తయారైంది కీర్తి. ఇటీవల ఆమె జిమ్‌లో దిగిన ఫొటో కూడా వైరల్‌ అయినా సంగతి తెలిసిందే. ప్రస్తుతం స్పెయిన్‌లో ఉన్న కీర్తి.. అక్కడ దిగిన కొన్ని ఫొటోల్ని ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా షేర్ చేయడంతో ఈ రచ్చ స్టార్ట్ అయింది.

    English summary
    Actress Sri Reddy commented on Keerthy Suresh fresh look. The 26-year-old Keerthy Suresh underwent a stunning body transformation by sweating it out in the gym for hours.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X