అక్కినేని నాగచైతన్య పై పడిన శ్రీ రెడ్డి.. డోస్ మార్చి సెన్సేషనల్ కామెంట్స్

Recommended Video

Sri Reddy Sensational Comments On Akkineni Naga Chaitanya || Filmibeat Telugu

సినిమా ఇండస్ట్రీ పెద్దలే లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారంటూ గతంలో నానా హంగామా చేసిన శ్రీ రెడ్డి మరోసారి విజృంభిస్తోంది. సోషల్ మీడియా వేదికగా తనకు ఏదనిపిస్తే అది ఓపెన్ గా చెప్పేస్తుండటం హాట్ టాపిక్ అవుతోంది. హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్లి అక్కడే సెటిలైన శ్రీ రెడ్డి.. ఈ మధ్యకాలంలో మళ్లీ మళ్లీ వార్తల్లో నిలుస్తోంది. తెలుగు, తమిళ సినీ ప్రముఖులను వదిలి పెట్టని శ్రీ రెడ్డి తాజాగా అక్కినేని నాగచైతన్య పై డిఫరెంట్ యాంగిల్‌లో కామెంట్ చేసింది. వివరాల్లోకి పోతే..

రెగ్యులర్ దారికి భిన్నంగా

రెగ్యులర్ దారికి భిన్నంగా

సాధారణంగా శ్రీ రెడ్డి కామెంట్స్ అంటేనే అందులో కావాల్సినంత మసాలా ఉంటుంది. ఊహించని ప్రముఖుల పేర్లు ఉంటాయి. అది నిజామా? కాదా! అన్నది పక్కన బెడితే ఆమె చేసిన కామెంట్స్ మాత్రం కొత్త ఆలోచనలు రేకెత్తిస్తాయి. అయితే ఈ సారి అక్కినేని వారసుడు నాగచైతన్య విషయమై తన రెగ్యులర్ దారికి భిన్నంగా స్పందించి ఆశ్చర్యపర్చింది శ్రీ రెడ్డి.

అలాంటిది నాగచైతన్య ఎప్పుడు చేస్తాడో!

''అక్కినేని నాగచైతన్య మీరంటే నాకు చాలా ఇష్టం. మీ హిట్ సినిమా కోసం వెయిట్ చేస్తున్నాం'' అంటూ తన ఫేస్‌బుక్‌లో ఓ సంచలన కామెంట్ పోస్ట్ చేసింది శ్రీ రెడ్డి. అయితే ఈ కామెంట్ చూసిన నెటిజన్లు.. ఇంతకీ శ్రీ రెడ్డి, నాగ చైతన్యను పొగిడిందా? లేక నీకు హిట్స్ పడటం లేవు.. యాక్టింగ్ రాదు! అని పంచ్ విసిరిందా? అనేది అర్థం కాక తల పట్టుకుంటున్నారు. ఈ మేరకు ఇద్దరిపై కామెంట్స్ విసురుతున్నారు.

గతంలో సమంతపై..

గతంలో సమంతపై..

నాగ చైతన్య భార్య సమంత గత సినిమా యూ టర్న్ పై కూడా శ్రీ రెడ్డి పాజిటివ్‌గా రియాక్ట్ అయింది. దీంతో అక్కినేని వారి విషయంలో శ్రీ రెడ్డి తీరేంటో అర్థం కావడం లేదు. కాగా అంతకుముందు సమంత, నయనతార, కాజల్, తమన్నా, త్రిష లాంటి టాప్ హీరోయిన్స్ కాస్టింగ్ కౌచ్ బాధితులే అని శ్రీ రెడ్డి హింట్స్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

వెంకీమామతో నాగచైతన్య

వెంకీమామతో నాగచైతన్య

ప్రస్తుతం నాగచైతన్య రియల్ లైఫ్ మామ దగ్గుబాటి వెంకటేష్ తో కలిసి వెంకీ మామ సినిమాలో నటిస్తున్నాడు. కామెడీ మల్టీస్టారర్ ఎంటర్‌టైనర్ మూవీగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాలో పాయల్ రాజ్‌పుత్, రాశి ఖన్నా హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా అతిత్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. సరిగ్గా ఈ తరుణంలో నాగ చైతన్యపై శ్రీ రెడ్డి చేస్తున్న కామెంట్స్ పలు అనుమానాలకు తావిస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X