twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రెచ్చిపోయిన శ్రీ రెడ్డి.. నా వీడియోలు వాడారా ఇక అంతే! అంటూ స్ట్రాంగ్ వార్నింగ్

    |

    సంచలన తార శ్రీ రెడ్డి మరోసారి రెచ్చిపోయింది. సోషల్ మీడియా వేదికగా విరుచుకు పడుతూ కొందరికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చేసింది. గత కొంతకాలంగా తనదైన పంథాలో వెళ్తూ బూతు కామెంట్లు పోస్ట్ చేస్తున్న ఆమె ఈ సారి ఏకంగా మీడియా వర్గాలపై పడటం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. పలు యూట్యూబ్ ఛానెల్స్‌ని ఉద్దేశిస్తూ ఆమె చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అవుతున్నాయి. వివరాల్లోకి పోతే..

    చుక్కలు చూపిస్తున్న శ్రీ రెడ్డి

    చుక్కలు చూపిస్తున్న శ్రీ రెడ్డి

    కాస్టింగ్ కౌచ్ అంటూ ఓ మంచి ఉద్యమమే లేవనెత్తిన శ్రీ రెడ్డి.. మధ్యలోనే దానికి ఫుల్‌స్టాప్ పెట్టేసి, గత కొంతకాలంగా సోషల్ మీడియా వేదికగా సంచలనం సృష్టిస్తోంది. ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్స్ వేదికగా చేసుకొని పలువురు సినీ ప్రముఖులకు చుక్కలు చూపిస్తోంది శ్రీ రెడ్డి. దీంతో ఎప్పుడు ఎలాంటి బాంబు ఎవ్వరిపై విసురుతుందో కూడా అర్థంకాని పరిస్థితి నెలకొంది.

    పవన్, చిరంజీవి అయ్యారు.. ఇప్పుడు వీరిపై

    పవన్, చిరంజీవి అయ్యారు.. ఇప్పుడు వీరిపై

    ఇప్పటికే టాలీవుడ్‌లో పవన్, చిరంజీవి, నాని, విశాల్ లాంటి అగ్ర హీరోలను టార్గెట్ చేసిన శ్రీ రెడ్డి.. తమిళ ఇండస్ట్రీకి చెందిన నటీనటులను కూడా వదిలిపెట్టడం లేదు. ఇదిలా ఉండగానే తాజాగా పలు యూట్యూబ్ ఛానెల్స్‌పై కూడా కన్నేసి వాళ్లందరికీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తూ ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టింది శ్రీ రెడ్డి.

    నా వీడియోలు అలా వాడుకున్నారంటే..

    నా వీడియోలు అలా వాడుకున్నారంటే..

    ''తెలుగు, తమిళ యూ ట్యూబ్ ఛానెల్స్.. ఎవరైనా కానీ నా వీడియోలు స్పూఫ్ చేసి వాడుకున్నారంటే మీకు చుక్కలు చూపిస్తా, ఆ తర్వాత నేనేం చేస్తానో మాత్రం చెప్పలేను'' అంటూ ఫేస్‌బుక్‌లో షాకింగ్ కామెంట్ చేసింది శ్రీ రెడ్డి. ఈ పోస్ట్ చూసి అంతా ఒక్కసారిగా విస్తు పోయారు. ఈమె ఇలా ఇలా ఉన్నట్టుండి యూట్యూబ్ ఛానెల్స్‌‌పై పడిందంటూ చర్చించుకుంటున్నారు.

    శ్రీ రెడ్డి గురించి జగమెరిగిన వాస్తవం

    ఒకరకంగా చెప్పాలంటే శ్రీ రెడ్డిని సెలెబ్రిటీ చేసిందే యూ ట్యూబ్ ఛానెల్స్. ఆమె గురించి ఎన్నో వేల వీడియోలు, వార్తలు రాస్తేనే ఆమెకు ఈ పాపులారిటీ వచ్చిందనేది జగమెరిగిన వాస్తవం. అలాంటిది అదే యూ ట్యూబ్ ఛానెల్స్ గురించి శ్రీ రెడ్డి ఈ రకంగా కామెంట్ చేయడం పలు రకాల చర్చలకు తావిస్తోంది.

    వెల్లువెత్తుతున్న కామెంట్స్.. నువ్వు కూడా నీతులు చెప్తున్నావా?

    వెల్లువెత్తుతున్న కామెంట్స్.. నువ్వు కూడా నీతులు చెప్తున్నావా?

    ఇక శ్రీ రెడ్డి పెట్టిన ఈ పోస్ట్ చూసి అదే ఫేస్‌బుక్‌ వేదికగా ఆమెపై విరుచుకు పడుతూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. ఈ రోజు అనుభవిస్తున్న స్టార్ డమ్ ఎలా వచ్చిందో తెలుసుకోకుండా శ్రీ రెడ్డి ఇలా అనడం దారుణం అని పేర్కొంటున్నారు. హీరోలు, నిర్మాతలు, దర్శకుల పేర్లు పెట్టి మరీ ఇష్టమొచ్చినట్లు తిట్టే నువ్వు కూడా నీతులు చెప్తున్నావా అంటూ ఇంకొందరు ఫైర్ అవుతున్నారు. చూడాలి మరి ఈ ఇష్యూ ఇంకెంత దూరం వెళుతుందో!.

    Recommended Video

    #CineBox: Tapsee Strong Counter To Reporter | Prabhas Fans Urges For #Prabhas20 Update
    శ్రీ రెడ్డి కథ క్లైమాక్స్‌

    శ్రీ రెడ్డి కథ క్లైమాక్స్‌

    సంచలనాలకు మారుపేరైన శ్రీ రెడ్డి క్లైమాక్స్‌లో చేరింది. ఇన్నాళ్లు టాలీవుడ్, కోలీవుడ్ సెలెబ్రిటీలపై విరుచుకుపడుతూ బూతు కామెంట్లు పెట్టిన ఆమె.. ఏకంగా వెండితెరపై తన ప్రతాపం చూపించేందుకు రెడీ అవుతోంది. క్లైమాక్స్‌ పేరుతో తెరకెక్కుతున్న సినిమాలో ఆమె కీలక పాత్ర పోషిస్తోంది.

    English summary
    Tollywood Sensational star Sri Reddy Commits a new movie named as Climax. Now she put a comment on YouTube Channels and gave strong warning. This issue is now hot topic in social media.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X