మహేష్ బాబుపై శ్రీ రెడ్డి కామెంట్స్.. స్టార్ హీరోను అలా పోల్చుతూ! భలే స్కెచ్ వేసిందే!!

వివాదాస్పద తారగా మాంచి పాపులారిటీ తెచ్చుకుంది శ్రీ రెడ్డి. హిట్ సినిమాలు గానీ, ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ గానీ లేకుండానే సౌత్ ఇండియాలోనే స్టార్ హీరోయిన్ల స్థాయిలో మెరుపులు మెరిపిస్తోంది ఈ సెన్సేషనల్ క్వీన్. టాలీవుడ్‌లో ఎప్పుడూ ఎవరో ఒకరిని టార్గెట్ చేస్తూ కామెంట్లు పెట్టే ఈమె ఈ సారి సూపర్ స్టార్ మహేష్ బాబుపై కామెంట్ చేసింది. దీంతో మరోసారి శ్రీరెడ్డి టాపిక్ హాట్ ఇష్యూగా మారింది. వివరాల్లోకి పోతే..

సరిలేరు నీకెవ్వరు.. సూపర్ స్టార్ బాక్సాఫీస్ దాడి

సరిలేరు నీకెవ్వరు.. సూపర్ స్టార్ బాక్సాఫీస్ దాడి

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సరిలేరు నీకెవ్వరు మూవీ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. తొలిరోజే మొదటి ఆటతోనే సక్సెస్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా రికార్డులను తిరగరాస్తూ బాక్సాఫీస్ దాడి చేస్తోంది. ఈ తరుణంలో ఇదే సినిమాను ఉద్దేశిస్తూ మహేష్ బాబుపై కామెంట్ చేసింది శ్రీ రెడ్డి.

కాంట్రవర్సీ అంటేనే ఆమె.. ఇప్పుడిలా

కాంట్రవర్సీ అంటేనే ఆమె.. ఇప్పుడిలా

ఎప్పుడూ ఏదో ఒక ఫేమస్ సెలబ్రిటిని టార్గెట్ చేయడం, అతనిపై చెప్పకూడని పదజాలంతో విరుచుకుపడటం శ్రీ రెడ్డి స్టైల్. ఈ మేరకు ఇప్పటికే ఎందరో నిర్మాతలు, హీరోలపై పంజా విసిరింది శ్రీ రెడ్డి. దీంతో ఈమె సోషల్ మీడియా ఖాతా అంటే అంతా ఇలాంటి మెసీజీలే అని ఫిక్సయ్యారంతా. ఈ పరిస్థితుల్లో మహేష్ బాబుపై ఆమె రియాక్ట్ కావడం హాట్ టాపిక్ అయింది.

మహేష్ బాబు గారూ.. మీరు తెలుగు చిత్రసీమలో

మహేష్ బాబు గారూ.. మీరు తెలుగు చిత్రసీమలో

సరిలేరు నీకెవ్వరు మహేష్ బాబు గారూ.. మీరు తెలుగు చిత్రసీమలో రారాజు అంటూ తన సందేశం పోస్ట్ చేసింది శ్రీ రెడ్డి. అంతేకాదు మీరు చంద్రుడు అని తెలుపుతూ ఇతర తారలంతా స్టార్స్ మాత్రమే అని పేర్కొంది శ్రీ రెడ్డి. అంటే మహేష్ బాబుపై ఆమె చాలా పాజిటివ్‌గా ఉందని అర్థం.

సూపర్ స్టార్ అభిమానుల రియాక్షన్

సూపర్ స్టార్ అభిమానుల రియాక్షన్

శ్రీ రెడ్డి పెట్టిన ఈ మెసేజ్ చూసి సూపర్ స్టార్ అభిమానులు పెద్ద ఎత్తున రియాక్ట్ అవుతున్నారు. థాంక్యూ మేడం అంటూ కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు. కొందరు నెటిజన్లు మాత్రం ఆమె తీరును తప్పుబడుతూ కేవలం సెల్ఫ్ ప్రమోషన్ కోసమే శ్రీ రెడ్డి ఇదంతా చేస్తోందని కామెంట్ చేస్తున్నారు.

అందుకే ఇలాంటి కామెంట్స్ చేస్తోందా?

వివాదాస్పద మాటలు, చెప్పుకోలేని బూతులు పోస్ట్ చేసి తన పేరును దేశవ్యాప్తంగా మారుమోగేలా చేసింది శ్రీ రెడ్డి. కాస్టింగ్ కౌచ్ అంటూ నడిరోడ్డుపై అర్థనగ్న ప్రదర్శనతో నిరసన తెలిపింది. వీటి ఫలితమే ఆమెకు భారీ ఫాలోయింగ్. ఇప్పుడు సినిమాలు కూడా చేస్తోంది. అందుకే ఇకపై పాజిటివ్ రూట్‌లో స్టార్ హీరోల అభిమానులను కూడా బుట్టలో వేసుకునే ప్రయత్నమే ఇది అనే టాక్ వస్తోంది.

 క్లైమాక్స్‌లో చేరిన శ్రీ రెడ్డి

క్లైమాక్స్‌లో చేరిన శ్రీ రెడ్డి

ఇన్నాళ్లు టాలీవుడ్, కోలీవుడ్ సెలెబ్రిటీలపై విరుచుకు పడుతూ బూతు కామెంట్లు పెట్టిన శ్రీ రెడ్డి ఏకంగా వెండితెరపై తన ప్రతాపం చూపించేందుకు రెడీ అవుతోంది. తన రియల్ లైఫ్ క్యారెక్టర్‌కి వెండితెర రూపమివ్వబబోతోంది ఈ సంచలన తార. ఈ మేరకు క్లైమాక్స్ అనే సినిమా సెట్స్‌పై చేరింది శ్రీ రెడ్డి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X