పచ్చిగా మాట్లాడిన శ్రీ రెడ్డి.. జగన్ పేరు తీస్తూ షాకింగ్ కామెంట్స్.. సిగ్గులేదా?

సంచలన తార శ్రీ రెడ్డి మరో సంచలనానికి తెరలేపింది. ఎప్పుడూ ఏదో ఒక ఇష్యూలో తలదూర్చుతూ వార్తల్లో నిలిచే ఈమె.. తాజాగా ఓ లైవ్ చాట్‌లో పాల్గొని ఆంధ్రప్రదేశ్ లోని ముఖ్య రాజకీయ నాయకులపై షాకింగ్ కామెంట్స్ చేసింది. దీంతో శ్రీ రెడ్డి చేసిన ఈ కామెంట్స్ సినీ, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

శ్రీ రెడ్డి బూతు పురాణం.. అబ్బో మామూలుగా లేదండీ బాబు

శ్రీ రెడ్డి బూతు పురాణం.. అబ్బో మామూలుగా లేదండీ బాబు

సాధారణంగానే తనకు నోటికేదొస్తే అదే మాట్లాడటం శ్రీ రెడ్డి నైజం. అవతలి వ్యక్తి ఎవరు? ఎవరి గురించి తాను ఇలా కామెంట్ చేస్తున్నా? లాంటి అంశాలేవీ పట్టించుకోకుండా దూసుకెళ్తుంది శ్రీ రెడ్డి. ఈ మేరకు తాజాగా జరిగిన ఈ లైవ్ చాట్‌లో శ్రీ రెడ్డి మాట్లాడిన తీరు చూసి అబ్బో మామూలుగా లేదండీ బాబు అంటున్నారు నెటిజన్లు.

నాకెందుకు భయం.. నన్నేం చేయలేరు

నాకెందుకు భయం.. నన్నేం చేయలేరు

నన్నెవరూ ఏమీ చేయలేరు.. నాకెందుకు భయం అన్నట్లుగా శ్రీ రెడ్డి కామెంట్స్ ఉంటాయి. కాస్టింగ్ కౌచ్ విషయమై టాలీవుడ్, కోలీవుడ్ సినీ ప్రముఖులపై లెక్కలేనన్ని ఆరోపణలు గుప్పించిన ఈమె.. ఇటీవలి కాలంలో రాజకీయ పరిస్థితులపై, రాజకీయ నాయకులపై కూడా విరుచుకు పడుతుండటం చూస్తున్నాం.

సంబంధం లేని రాజకీయాల్లో తలదూర్చి..

సంబంధం లేని రాజకీయాల్లో తలదూర్చి..

ఈ నేపథ్యంలోనే తాజాగా శ్రీ రెడ్డి తన ఫేస్‌బుక్ పేజ్‌లో లైవ్ వీడియో చేసింది. దాదాపు 20 నిమిషాల పాటు చేసిన ఈ లైవ్‌లో మరోసారి ఎప్పటిలానే తనకు సంబంధం లేని రాజకీయాల్లో తలదూర్చి కామెంట్స్ చేసింది. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని పొగుడుతూ, ఆయన్ని విమర్శిస్తున్న వారిని తిడుతూ రచ్చ రచ్చ చేసింది.

చాలా పచ్చిగా.. జగన్‌పై శ్రీ రెడ్డి ఫీలింగ్స్

చాలా పచ్చిగా.. జగన్‌పై శ్రీ రెడ్డి ఫీలింగ్స్

ఈ వీడియోలో శ్రీరెడ్డి చాలా పచ్చిగా మాట్లాడేసింది. జగన్ పాలన గురించి, ఆయన గురించి మాట్లాడేటప్పుడు ఎవ్వరైనా నోరుదగ్గర పెట్టుకోవాలని ఆమె హెచ్చరించడం అందరికీ షాకిచ్చింది. ఈ మేరకు జగన్ ఓ మంచి మనిషి అని, మంచి ఆలోచనలు ఉన్న వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చి సేవ చేస్తున్నారని చెప్పింది. గతంతో పోలిస్తే జగన్‌లో చాలా పరిక్వత వచ్చిందని శ్రీ రెడ్డి తెలిపింది. ఇంతమంచి పాలన చేస్తున్నా జగన్‌పై చాలామంది ఆరోపణలు చేస్తున్నారని, అసలు వాళ్లకు సిగ్గులేదా? అనేసింది శ్రీరెడ్డి.

శ్రీ రెడ్డి టార్గెట్ ఆయనే.. జనం ఫైర్

శ్రీ రెడ్డి టార్గెట్ ఆయనే.. జనం ఫైర్

ఇక ఈ వీడియోని బట్టి చూస్తే శ్రీ రెడ్డి టార్గెట్ అంతా జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ అని స్పష్టంగా తెలుస్తోంది. అనకూడని, చెప్పకూడని పదజాలం ఉపయోగిస్తూ సంచలనం సృష్టించింది శ్రీ రెడ్డి. ఈ వీడియో చూసిన కొందరు శ్రీ రెడ్డి తీరుపై మండిపడుతున్నారు.

క్లైమాక్స్‌లో శ్రీ రెడ్డి

ఇన్నాళ్లు సినిమాలు లేవని మొత్తుకున్న శ్రీ రెడ్డికి ఇటీవలే 'క్లైమాక్స్‌' సినిమాలో అవకాశం దక్కింది. షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా అతిత్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో శ్రీ రెడ్డి పోషించే పాత్ర కీలకమైందని తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X