శ్రీ రెడ్డి సెన్సేషన్.. ఫ్రెషర్స్‌కి బంపర్ ఆఫర్! ఫస్ట్ ప్రియారిటీ ఎవరికంటే..

సంచలన తారగా భారీ పాపులారిటీ సంపాదించిన శ్రీ రెడ్డి.. మరో సెన్సేషన్ క్రియేట్ చేస్తూ వీడియో పోస్ట్ చేసింది. ఈ వీడియో ద్వారా తన పర్శనల్ విషయాలతో పాటు పొలిటికల్ జర్నీ, లవ్, పెళ్లి, సినిమాలు తదితర విషయాలు ప్రస్తావించింది. ఈ మేరకు తాను ఫ్రెషర్స్‌కి ఆఫర్ చేస్తా అని చెప్పింది. ఇంతకీ ఆమె చేసే ఆ ఆఫర్ ఏంటి? దానికి ఫ్రెషర్స్‌ మాత్రమే ఎందుకు? ఆ వివరాలు చూద్దామా..

కొదవలేని ఫాలోయింగ్.. కొత్తగా ఇలా కూడా

కొదవలేని ఫాలోయింగ్.. కొత్తగా ఇలా కూడా

సోషల్ మీడియాలో శ్రీ రెడ్డి హంగామా మామూలుగా ఉండదు. రచ్చ రచ్చ చేసేలా పోస్టులు పెట్టడంలో ఆమెకు ఎవ్వరూ సాటిరారు. అందుకే ఆమెకు అంతులేని ఫాలోయింగ్. అయితే ఇప్పుడు దానికి తోడు కొత్తగా యూ ట్యూబ్ ఛానెల్ ఓపెన్ చేసి వీడియోలు పోస్ట్ చేస్తూ సంచలనం సృష్టిస్తోంది శ్రీ రెడ్డి. ఈ మేరకు తనకున్న భారీ ఫాలోయింగ్‌కి ‌క్యాచ్ చేసుకుంటూ సొమ్ము చేసుకుంటోంది.

తాజా వీడియో.. శ్రీ రెడ్డి ముచ్చట్లు

తాజా వీడియో.. శ్రీ రెడ్డి ముచ్చట్లు

ఈ నేపథ్యంలో తాజా వీడియోలో శ్రీ రెడ్డి చెప్పిన ముచ్చట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాను ఇప్పుడిప్పుడే ఫ్రస్ట్రేషన్ నుంచి బయటపడుతున్నానని చెప్పిన ఆమె.. మునుపటి కంటే తనకు జనాల్లో గుర్తింపు పెరిగిందని తెలిపింది. అలాగే తన యూ ట్యూబ్ ఛానెల్ ని కూడా ఫాలోకమ్మని చెప్పింది.

ఫ్రెషర్స్‌కి బంపర్ ఆఫర్.. శ్రీ రెడ్డి ఆటం బాంబ్

ఫ్రెషర్స్‌కి బంపర్ ఆఫర్.. శ్రీ రెడ్డి ఆటం బాంబ్

ఫేస్ బుక్‌లో ఐదు మిలియన్ల ఫాలోవర్స్‌ని సంపాదించించి సోషల్ మీడియా సంచలనం‌గా మారింది. అయితే ఫేస్ బుక్‌తో పాటు యూట్యూబ్‌లోనూ తన ఫాలోవర్స్‌ని పెంచుకునేందుకు గాను వరుస వీడియోలను పోస్ట్ చేస్తోంది. ఇందులో భాగంగా తాజా వీడియోలో ఫ్రెషర్స్‌కి బంపర్ ఆఫర్ అంటూ ఆటం బాంబ్ పేల్చింది శ్రీ రెడ్డి.

ఫ్రెషర్స్‌కి శ్రీరెడ్డి ఆఫర్..

ఫ్రెషర్స్‌కి శ్రీరెడ్డి ఆఫర్..

త్వరలో శ్రీరెడ్డి ప్రొడక్షన్స్ పేరుతో తానొక నిర్మాణ సంస్థను ఏర్పాటు చేస్తున్నట్టు తెలియజేసింది శ్రీరెడ్డి. అయితే ఇందులో ప్రాధాన్యత మొదట తమిళ తంబీలకే ఇస్తానని చెప్పి షాకిచ్చింది. సినీ పరిశ్రమలో అవకాశాలు దొరక్క కష్టపడుతున్న ఫ్రెషర్స్‌కి శ్రీరెడ్డి ప్రొడక్షన్స్ ద్వారా బంపర్ ఆఫర్ ఇవ్వబోతున్నట్టు ఆమె తెలిపింది.

రియల్ లైఫ్ క్యారెక్టర్‌..

రియల్ లైఫ్ క్యారెక్టర్‌..

ఇక ఇన్నాళ్లు టాలీవుడ్, కోలీవుడ్ సెలెబ్రిటీలపై విరుచుకు పడుతూ బూతు కామెంట్లు పెట్టిన శ్రీ రెడ్డి.. ఏకంగా వెండితెరపై తన ప్రతాపం చూపించేందుకు రెడీ అవుతోంది. తన రియల్ లైఫ్ క్యారెక్టర్‌కి వెండితెర రూపమివ్వబబోతోంది. ఇటీవలే క్లైమాక్స్ అనే సినిమా సెట్స్‌పై చేరింది శ్రీ రెడ్డి.

క్లైమాక్స్‌లో శ్రీ రెడ్డి

క్లైమాక్స్‌లో శ్రీ రెడ్డి

క్రైమ్ థ్రిల్ల‌ర్ జోన‌ర్‌లో తెరకెక్కుతున్న క్లైమాక్స్ చిత్రంలో డా.రాజేంద్ర‌ప్ర‌సాద్‌, పృథ్వీరాజ్‌, శివ‌శంక‌ర్ మాస్ట‌ర్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. సాషా సింగ్‌, ర‌మేష్‌, చందు పాత్ర‌లు ప్ర‌ధానంగా ఉంటాయి. ఇందులో శ్రీ రెడ్డి పాత్రను హైలైట్ చేస్తూ పలు కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X